ఓ నటుడు సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బులు కూడా ఎత్తుకెళ్లడం గమనార్హం. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబైకి చెందిన నలభై యేళ్ల వ్యక్తి టీవీ సీరియల్స్‌లో నటుడిగా రాణిస్తున్నాడు. అతడి తండ్రి పలు టీవీ సీరియళ్లకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అతడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇందులో ఒక భార్య అంధేరీలోని లోఖండ్‌వాలాలో నివసిస్తోంది.

ఈ క్రమంలో సవతి తల్లిపై కన్నేసిన నటుడు వరుసకు తల్లి అవుతుందన్న ఇంగితం మరిచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. అయితే నిందితుడికి, బాధితురాలికి మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసు గురించి ఓషివారా సీనియర్‌ పోలీస్‌ అధికారి సంజయ్‌ బండలే మాట్లాడుతూ.. ఆరోపణలు రుజువైతేనే నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. నటుడి పేరు, తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు.