ప్రధాని నరేంద్రమోదీ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కేంద్రంలో ని బీజేపీ.. ప్రజలందరినీ ఫూల్స్ చేయాలని చూస్తోందన్నారు. దావోస్ మేథో మథనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బీజేపీ దేశ ప్రజలను బుద్ధిహీనులనుకుంటోందని వ్యాఖ్యానించారు. రైతులను వెర్రివాళ్లను చేస్తోందని.. అగ్ర వర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ల పేరుతో ఆ వర్గాల ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటోందన్నారు.

ఎన్నికలు దగ్గరపడేసరికి .. ఓటర్లను ఫూల్స్ చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ రకమైన ప్లాన్స్ వేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో ఐదుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు  చేసేందుకు బీజేపీ ప్రయత్నించి విఫలమైందన్నారు.