ఆ స‌మ‌యంలో వివాదాస్ప‌ద ప్ర‌సంగం చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ పోలీసులు వ‌ర్చువ‌ల్ రీతిలో ఆయ‌న్ను విచారించారు. 

బాలీవుడ్ హీరో, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో.. ఆయనను కోలకతా పోలీసులు విచారించారు. ఈ రోజు ఆయన 71వ పుట్టిన రోజు కాగా... ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.

. ఆ స‌మ‌యంలో వివాదాస్ప‌ద ప్ర‌సంగం చేసిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ పోలీసులు వ‌ర్చువ‌ల్ రీతిలో ఆయ‌న్ను విచారించారు.పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో ఆయనను ప్రశ్నించారు. ఆయన ప్రసంగం రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసకు దోహదపడిందని పోలీసులు ఆరోపించారు. 

తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)ను రద్దు చేయాలని మిథున్ చక్రవర్తి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పందిస్తూ, ఆయనను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. తాను నటించిన సినిమాల్లోని డయలాగ్‌లను మాత్రమే తాను తన ఎన్నికల ప్రసంగంలో చెప్పానని, వాటిని అక్షరాలనుబట్టి అర్థం చేసుకోకూడదని వాదించారు. 

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో, ‘‘నిన్ను ఇక్కడ తంతే, నీ శవం నేరుగా శ్మశానంలో పడుతుంది’’ అని మిథున్ చక్రవర్తి అన్నారని ఆరోపించారు.