రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలకు కారణమైన నటుడు దీప్ సిధును పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రిపబ్లిక్ డే నాడు రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే ఆ ర్యాలీ ముందు అనుకున్నట్టుగా కాకుండా నిరసనకారులు హింసలు పాల్పడ్డారు. కంచెలు దాటుకుని వెళ్లి ఎర్రకోట ముందు సిక్కు మత జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత దీప్ సిధు కనిపించకుండా పోయాడు. 

అయితే తాము శాంతియుతంగా చేస్తున్న దీక్షను దీప్ సిధు కావాలనే రెచ్చగొట్టాడంటూ రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. దీప్ సిధు మీద తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. 

దీప్ సిధు నటుడు, కార్యకర్త. ఇతను బీజేపీ నాయకుడు సన్నీడియోల్ సన్నిహితుడని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.