సంచలనం సృష్టించిన  కోరేగావ్ - భీమా కేసులో యాక్టివిస్ట్ ఫాదర్ స్టాన్ స్వామిని జార్ఖండ్ రాజధాని రాంచీలోని అతని ఇంటినుండి ఢిల్లీ ఎన్ఐఎ అధికారి బృందం తీసుకెళ్లింది.

83 యేళ్ల ఫాదర్ స్టాన్ స్వామి గిరిజనులతో కలిపి పనిచేస్తారు. 2018లో మహారాష్ట్ర కోరేగావ్-భీమా గ్రామంలో జరిగిన హింసాకాండపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తు సంస్థే స్టాన్ స్వామిని అరెస్ట్ చేసింది. 

ఫాదర్ స్టాన్ స్వామి సామాజిక కార్యకర్త, గిరిజనులతో కలిసి పనిచేస్తుంటారు. అతన్ని రాంచీలోని అతని స్వగృహంలో ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తీసుకెళ్లడానికి ముందు 20 నిమిషాల పాటు అధికారులు అతనితో మాట్లాడినట్టు సమాచారం.

స్టాన్ స్వామి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివిస్టుల ఆగ్రహానికి కారణమయ్యింది. అతను అరెస్టు ఆగ్రహం కలిగించింది. ఆదివాసుల హక్కుల కోసం జీవితకాల పోరాటం చేసిన వ్యక్తి స్టాన్ స్వామి అంటూ చరిత్రకారుడు రామచంద్ర గుహ ట్వీట్ చేశాడు. 

ఆదివాసుల జీవితాలు, జీవనోపాధి కంటే మైనింగ్ కంపెనీల లాభాలకే మోడి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని.. అందుకే వారి తరఫున మాట్లాడే వారిని సైలెంట్ చేయడం కోసమే ఇలాంటి అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు గుహ.

లాయర్, యాక్టివిస్ట్ ప్రశాంత్ భూషణ్ కూడా ఈ అరెస్టులు ఖండించారు. ఐదు దశాబ్దాలుగా జార్ఖండ్ లోని ఆదివాసులతో కలిసి పనిచేస్తున్న స్టాన్ స్వామిని ఇదివరకు చాలాసార్లు ఈ కేసు విషయంలో విచారించారు. 

2017, డిసెంబర్ 31న పూనేలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించింది. ఈ సంఘటన వల్లే ఆ తరువాత మహారాష్ట్రలో హింస, కాల్పులు జరిగాయి, ఒకరు మరణించారు.