Asianet News TeluguAsianet News Telugu

మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల్లో మైకులు, లౌడ్ స్పీక‌ర్లు పెడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు.. : యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్

Lucknow: మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను, మైకుల‌ను మళ్లీ ఏర్పాటు చేయడం ఆమోదయోగ్యం కాదని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌జ‌ల స్పంద‌న‌ల‌తో త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారుల‌ను ఆదేశించారు.
 

Action will be taken if mikes and loudspeakers are installed in religious places. : UP CM Yogi Adityanath
Author
First Published Dec 24, 2022, 4:01 PM IST

Uttar Pradesh: మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాలు, వివిధ మ‌తాల‌కు చెందిన‌ ప్రార్థ‌న మందిరాలు, భ‌వ‌నాల‌పై ఏర్పాటు చేసిన మైకులు, లౌడ్ స్పీక‌ర్ల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం వాటిని తొల‌గించింది. అయితే, కొన్ని రోజులు గ‌డిచిన త‌ర్వాత మ‌ళ్లీ ఆయా మ‌త ప‌ర‌మైన ప్ర‌దేశాల్లో మైకులు, లౌడ్ స్పీక‌ర్ల‌ను పెట్ట‌డంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇదివ‌ర‌కు మైకులు, లౌడ్ స్పీక‌ర్లు తొల‌గించిన ప్రాంతాల్లో వాటిని తిరిగి పెడితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తోంది. ఇదే విష‌యంపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ అక్క‌డి అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. మ‌ళ్లీ లౌడ్ స్పీక‌ర్లు పెట్ట‌డం త‌గ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొన్ని జిల్లాల్లో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించిన కొన్ని నెలల తర్వాత వాటిని మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తున్నారని అన్నారు. ఇది ఆమోదియోగ్యం కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్పడిన వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.  ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. లౌడ్ స్పీక‌ర్లు, మైకుల‌కు సంబంధించి ప్ర‌జ‌లను క‌ల‌వ‌డం ద్వారా త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. శుక్రవారం రాత్రి అన్ని స్థాయిల అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను సమీక్షించిన ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్, శాంతియుతంగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇదే స‌మ‌యంలో మ‌తమార్పిడిల‌కు సంబంధించిన రిపోర్టుల‌పై అధికారుల‌ను హెచ్చ‌రించారు. క్రిస్మ‌స్ వేడుక‌ల సంద‌ర్భంగా మత మార్పిడిలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

"కొన్ని నెలల క్రితం.. మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించే అపూర్వమైన ప్రక్రియను మేము పూర్తి చేసాము. పెద్ద ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు స్వయంచాలకంగా లౌడ్ స్పీకర్లను తొలగించారు. ఇది దేశవ్యాప్తంగా ప్రశంసించబడింది" అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల్లో లౌడ్ స్పీక‌ర్లు, మైకులు ఏర్పాటు చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి చ‌ర్య‌లు త‌గ‌వ‌నీ, వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. కాగా,  ఈ ఏడాది ప్రారంభంలో, ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించే ప్రచారాన్ని చేపట్టింది. ఆ తర్వాత మేలో జరిగిన సమీక్షా సమావేశంలో లక్షకు పైగా లౌడ్ స్పీకర్లను, మౌకుల‌ను తొలగించినట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తెలిపారు. వాటిని మళ్లీ అమర్చకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మతపరమైన కార్యక్రమాలు మత స్థలాల ప్రాంగణంలో జరగాలని, రోడ్లపై పండుగలు నిర్వహించరాదని, సాధారణ పౌరుల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అక్రమ లౌడ్‌స్పీకర్‌లను తొలగించాలనీ, ఇతర లౌడ్‌స్పీకర్‌ల సౌండ్‌ని నిర్ణీత పరిమితికి పరిమితం చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 25-మే 1 మధ్య రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది. ఈ తర్వాత రాష్ట్రంలోని చాల ా ప్రాంతాల్లో మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios