Asianet News TeluguAsianet News Telugu

శబరిమల యాత్రికులను ప్రమాదం నుంచి కాపాడిన కెఎస్‌ఆర్‌టిసి బస్ డ్రైవర్.. ఆ రియల్ హీరోకి హ్యట్సాఫ్

కేరళలోని పతనంమిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 18 మందికి గాయపడ్డారు. అయితే.. ఈ సమయంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ సమయ స్ఫూర్తితో వ్యవహరించారు. మృత్యు ఒడిలోకి వెళ్తున్న ప్రయాణికులను తన ప్రాణాలు అడ్డు వేసి కాపాడారు. రియల్ హీరోగా నిలిచారు. 

Act of courage on road, bus driver a real-life hero
Author
First Published Nov 21, 2022, 7:59 PM IST

బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఓ బస్సు ఏటవాలుగా ఉన్న రోడ్డులో దూసుకుపోతోంది. ఆ బస్సులో దాదాపు 60 మంది శబరిమల యాత్రికులు ఉన్నారు. వారందరూ  జరగబోయే ప్రమాదాన్ని తలుచుకుని భయపడుతున్నారు.  ఏం చేయాలో తెలియక ప్రాణాలు చేతులు పట్టుకుని.. ఆ దేవున్ని ప్రార్దిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి నిజంగా దేవుడిలా వచ్చాడు. సమయ స్ఫూర్తితో వ్యవహరించారు. తన ప్రాణాలను పన్నంగా పెట్టి.. మృత్యు ఒడిలోకి వెళ్తున్న ప్రయాణీకులను కాపాడారు. అతడే అలువాకు చెందిన కెఎస్‌ఆర్‌టిసి బస్సు డ్రైవర్ పిఆర్ స్మితోష్. అతడు శుక్రవారం నాడు అనేక మంది ప్రాణాలను కాపాడారు. రియల్ హీరో అంటూ ఆయనను పొగిడేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులతో శబరిమలకు వెళ్తున్న బస్సు బ్రేకులు ఫెయిలైంది. ఆ ప్రమాద సమయంలో స్మితోష్ అనే బస్సు డ్రైవర్ చకచక్యంగా వ్యవహరించాడు. ప్రయాణీకుల కేకలు విన్న స్మితోష్ ప్రమాదాన్ని గుర్తించారు. బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయని భావించిన ఆయన తన బస్సు(కెఎస్‌ఆర్‌టిసి బస్సు) అడ్డుపెట్టి.. ఆ బస్సు వేగాన్ని నియంత్రించాడు. దీంతో బస్సు ఆగిపోయింది. ఈ ఘటన ఎరుమేలి-పంపవెల్లి-పంపా రహదారిలోని కనమల వంతెన సమీపంలోని అత్తివాలవ్ వద్ద చోటుచేసుకుంది.  

అలువా డిపోకు చెందిన స్మితోష్ .. అలువా నుండి పంపాకు చార్టర్డ్ సర్వీస్ నడుపుతున్నాడు. అక్కడ బస్సు ఆపకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారన్నారు. అతడు ప్రమాదాన్ని నియంత్రించిన తీరు మీడియాకు తెలిపారు.(అతని మాటల్లో) మా బస్సు ఆంధ్రా బస్సును ఓవర్‌టేక్ చేసింది. ఆ సమయంలో బస్సులో క్లచ్ కాలిపోవడం గమనించాను. పైకి చేరిన తరువాత.. కన్మల వంతెన వైపు వెళుతున్నప్పుడు.. ఆంధ్ర బస్సు డ్రైవర్ .. హారన్ ను కంటిన్యూగా మోగిస్తున్నాడు.

ఈ తరుణంలో ఆ బస్సు.. మా బస్సును ఓవర్ టేక్ చేసి.. రోడ్డుపై ఉన్న ఒక బంప్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు వెనుకకు వచ్చింది. కొద్దిసేపటికే.. లోపల నుండి ప్రయాణీకులు అరడం ప్రారంభించారు. అకస్మాత్తుగా.. నేను ప్రమాదాన్ని పసిగట్టాను. వెంటనే..వెనుక సీట్లలో ప్రయాణికులు ఉన్నారా లేదో గమనించమని మా కండక్టర్ రాజీవ్ ని అడిగాను. అతడు లేరు అనడంతో.. నేను మా బస్సును ఆపడానికి హ్యాండ్‌బ్రేక్‌ని లాగి.. బ్రేక్ వేశారు. మా వాహనాన్ని వెనక్కు తిప్పాను " అని స్మితోష్ చెప్పాడు. 

కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండడం, మరో వాహనంలో కిక్కిరిసిపోవడంతో స్మితోష్‌కి ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడం కష్టమైంది. KSRTC బస్సు ఇతర వాహనాన్ని ఆపడంలో విఫలమైతే.. ఆ రెండు బస్సులు లోయలో పడిపోతాయి.  "నేను ఎలా నిర్ణయం తీసుకున్నానో నాకు తెలియదు. అది దేవుడి నిర్ణయం కావచ్చు" అని అతను చెప్పాడు. బస్సు ఆగిన తర్వాత.. దాదాపు యాత్రికులందరూ స్మితోష్ వద్దకు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. "ఆ భావాలను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. చాలా మందిని నీలో ఆ అయ్యప్పను చూసినట్లుగా ఉందని ధన్యవాదాలు తెలిపారు. అని స్మితోష్ భావోదేగ్వానికి గురయ్యారు. 

రోడ్డుపై ఢీకొనడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది . మోటారు వాహనాల శాఖ (ఎంవిడి) అధికారులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది సాధారణ ప్రమాదంగా భావించిన MVD అధికారులు, ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి KSRTC బస్సును రోడ్డు పక్కకు తరలించాలని స్మితోష్‌ను కోరారు. అయితే, స్మితోష్ పరిస్థితిని అధికారులకు వివరించాడు. ఆంధ్రా బస్సు బ్రేక్ సిస్టమ్ పూర్తిగా ఫెయిలయిందని, KSRTC బస్సును అక్కడి నుండి తొలగిస్తే.. ఆ బస్సు లోయలో పడుతుందని చెప్పడంతో ఆ అధికారులు తొలుత షాక్ కు గురయ్యారు. ఆ తరువాత ఆ డ్రైవర్ సమయస్పుర్తిని మెచ్చుకున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 18 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. మణికందన్ అనే ఎనిమిదేళ్ల బాలుడు అనేక గాయాలతో కొట్టాయం ఎంసీహెచ్‌లో శస్త్రచికిత్స చేశారు. వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన 84 మంది రెండు బస్సులలో శబరిమల యాత్రకు వెళ్లారు. అయ్యప్ప దర్శనం తర్వాత తిరిగొస్తుండగా పథనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర శనివారం ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios