స్నేహం చేసేందుకు ఒప్పుకోలేదని ఓ మహిళపై యాసిడ్ తో దాడి చేశాడు ఓ ఆటో డ్రైవర్. ఆమెను పని చేసే ప్రదేశం నుంచి ఇంటికి, ఇంటి నుంచి పని ప్రదేశానికి ప్రతీ రోజూ తీసుకెళ్తుండేవాడు. ఈ పరిచయాన్ని స్నేహంగా మార్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె దానిని రిజెక్ట్ చేయడంతో పగ పెంచుకొని యాసిడ్ పోశాడు.
మహిళలపై దాడులు ఆగడం లేదు. రోజు రోజుకు లైంగిక దాడులు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. ప్రేమించాలని, స్నేహం చేయాలని వెంటబడటం లేకపోతే బెదిరింపులకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. లవ్ రిజెక్ట్ చేసిందని, తనను పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడులు, ఆమెపై కిరాతకంగా ప్రవర్తించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ మహిళ తనతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదని ఆమెపై యాసిడ్ పోశాడు ఓ వ్యక్తి. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజునే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం శోఛనీయం.
పోలీసులు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ (AHMEDABAD)లోని ఘట్లోడియా ( Ghatlodia) ప్రాంతానికి చెందిన శివ నాయక్ (shiva nayak) ఆటో డ్రైవర్ (auto driver)గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల మహిళ నరన్‌పురా (naranpura) ప్రాంతంలోని నాని లఖుడి తలావ్ (nani lakudi thalav) సమీపంలోని రెసిడెన్షియల్ సొసైటీలో కేర్‌టేకర్ (care taker) గా పనిచేస్తున్నారు. అయితే ఆమెను ఆటో డ్రైవర్ ప్రతీ రోజు పని చేసే ప్రదేశానికి, ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు.
ఈ సమయంలో ఇద్దరికి కాస్త పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అయితే కొంత కాలం తరువాత ఆ ఆటో డ్రైవర్ స్నేహం చేయాలని ఆమెను కోరారు. దీనికి ఆ మహిళ ఒప్పుకోలేదు. అయితే ప్రతీ రోజులాగే ఆమె పని చేసే ప్రదేశం నుంచి ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఆమెను ఆటో డ్రైవర్ వెంబడించాడు. చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై యాసిడ్ దాడితో దాడి చేశారు. దీంతో ఆమె ఛాతీపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. బాధితురాలి శరీరంపై దాదాపు 15% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 326A యాసిడ్ దాడికి, 354D వేధింపులకు, 506 (1) క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
గత నెలలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. జిల్లాలోని ఉట్నూరు (utnoor) మండలం లక్కారం పరిధిలోని కేబీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.యాసిడ్ దాడి జరిగిన వెంటనే బాధిత మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేశారు.
