కాంగ్రెస్‌ ర్యాలీలో యాసిడ్ దాడి: 25 మందికి తీవ్ర గాయాలు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 3, Sep 2018, 2:53 PM IST
Acid attack during Congress rally in Tumakuru injures 25
Highlights

 కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలో సోమవారం నాడు  గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌దాడికి పాల్పడ్డారు. దీంతో సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  తీవ్రంగా గాయపడ్డారు.

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలో సోమవారం నాడు  గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌దాడికి పాల్పడ్డారు. దీంతో సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  తీవ్రంగా గాయపడ్డారు.

 కర్ణాటక రాష్ట్రంలో  ఇటీవ జరిగిన  స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో  కాంగ్రెస్, జేడీఎస్  కూటమి  అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. అయితే   ఈ ఫలితాలను పురస్కరించుకొని తుముకూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో  కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు.

loader