పోలీస్ కస్టడీలో వున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు అనే వ్యక్తి నుంచి పుట్టలింగస్వామి రూ. 13 లక్షలు తీసుకున్నాడు

పోలీస్ కస్టడీలో వున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు అనే వ్యక్తి నుంచి పుట్టలింగస్వామి రూ. 13 లక్షలు తీసుకున్నాడు.

దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హనుమంతనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుట్టలింగస్వామిని అరెస్ట్‌ చేసి శుక్రవారం రాత్రి ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చారు.

మేడపై పత్రాలు ఉన్నాయని చెప్పిన పుట్టలింగస్వామి పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన పోలీసులు ఎట్టకేలకు తేరుకుని నిందితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి హనుమంతనగర ఎస్‌ఐ మంజునాథ్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు.