Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోనే అతి పెద్ద గంటను అమర్చుతుంటే ప్రమాదం : ఇద్దరు మృతి

రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున  80,000 కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేయనున్నారు. దీని శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గంట. 

Accident while setting the world's largest bell in rajasthan kota : Two died - bsb
Author
First Published Nov 20, 2023, 10:55 AM IST

కోటా : రాజస్థాన్‌లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కడుతున్న సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు, గంట ఏర్పాటుకు పనిచేసిన ఇంజినీరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రమాద సమాచారం తెలియడంతో కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

చంబల్ రివర్ ఫ్రంట్ రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున నిర్మించారు. ఈ నది ముందు భాగంలో 80,000 కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేయనున్నారు. దీని శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంట. ఇది 5000 సంవత్సరాల వరకు ఉంటుందని చెబుతున్నారు.

Crime News: గడ్డివాములో ప్రియుడితో భార్య సరసాలు.. సజీవంగా దహనం చేసిన భర్త: పోలీసులు

గంట కట్టిన ఇంజనీర్ దాని కిందే సమాధి..
ఈ గంటను రివర్ ఫ్రంట్‌కు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇంజినీర్ల ఆధ్వర్యంలో పలు సాంచెల్లో అంచెలవారీగా గంటను తయారు చేశారు. ఈ నెల మొదటినుంచి వీటిని ఒక్కొక్కటిగా తెరవడం ప్రారంభించారు. ఈ రోజు తెరిచిన ఒక సాంచెలోని.. అచ్చు అకస్మాత్తుగా విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్, ఇతర కూలీలు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఇంజనీర్ 35 అడుగుల కింద పడిపోయాడు. 

ఈ ప్రమాదంలో ఇంజినీరుతో పాటు, ఒక కార్మికుడు మృతి చెందాడు. చనిపోయిన ఇంజనీరే ఈ గంట నిర్మాణంలో కీలకం అని తెలుస్తోంది. అతని పేరు దేవేంద్ర ఆర్య. ఆయన పర్యవేక్షణలో గంటను అచ్చు నుండి బయటకు తీస్తున్నారు. మొదట దేవేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన మృతి చెందాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios