Asianet News TeluguAsianet News Telugu

ఈయూ గ్రీన్ పాస్ వివాదం : కొవాగ్జిన్, కోవిషీల్డ్ లను అనుమతించపోవడంపై కేంద్రం సీరియస్..

వ్యాక్సినేషన్ పాస్పోర్టు విషయంలో లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ సర్టిఫికేషన్ ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది.  బదులుగా యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

Accept Covishield and Covaxin, will exempt vaccinated people from mandatory quarantine: India to EU - bsb
Author
Hyderabad, First Published Jul 1, 2021, 10:16 AM IST

వ్యాక్సినేషన్ పాస్పోర్టు విషయంలో లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ సర్టిఫికేషన్ ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది.  బదులుగా యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

ఈయూ దేశాల్లో అలాగే సభ్య దేశాల మధ్య ప్రయాణించే వారికి డిజిటల్ కోడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్ పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ లిస్టులో భారత్లో తయారవుతున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండటం తెలిసిందే. 

ఎక్కువ మంది భారతీయులు తీసుకుంటున్న కొవిషీల్డ్‌కు సైతం చోటు దక్కకపోవడంతో భారతీయ ప్రయాణికులకు ఇబ్బందిగా అంశమని ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో కేంద్రం త్వరితగతిన స్పందించింది.

తక్షణమే రెండు వ్యాక్సిన్ లకు అనుమతి ఇవ్వాలని లేకుంటే ఈయూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్పోర్ట్ లను అనుమతించమని పైగా కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈ యు ఏజెన్సీ (27 దేశాల సమాఖ్య)ను హెచ్చరించింది కేంద్రం. 

ఒకవేళ అనుమతిస్తే క్వారంటైన్‌ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్‌ సర్టిఫికెట్ లిస్టులో మన దగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లను మొదటి ఫేజ్ లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం కనీసం కొవిషీల్డ్‌ తీసుకున్న వాళ్ళకైనా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

 అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్‌  వ్యాక్సిన్ లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్‌’కు కూడా చోటివ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు.

ఈయూ వెళ్లానుకున్న వారికి షాక్.. కోవిషీల్డ్ వేసుకుంటే ‘గ్రీన్ పాస్’ కు నో..!!...

ఇక తాజా పరిణామాలపై యూరోపియన్  మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) స్పందించింది. కొవిడ్‌ నేపథ్యంలో సభ్య దేశాల మధ్య ఆటంకాలు లేని ప్రయాణం కోసం గ్రీన్ పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం  ఫైజర్‌/బయోఎన్‌టెక్‌, మెడెర్నా, వాక్స్‌జెర్విరియా, జన్‌స్సెన్‌ వ్యాక్సిన్లను  మాత్రమే (ఈఎంఏ) ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి. 

అయితే కొవిషీల్డ్‌ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలని అభ్యర్థనలేవీ రాలేదని.. ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ  కొవిషీల్డ్‌ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని అందుకు నెల టైం పట్టొచ్చు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios