వేలూరు: తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లంచం తీసుకొన్న డబ్బులతో  ఆయన పలువురు మహిళలతో రాసలీలలు జరిపినట్టుగా గుర్తించారు అధికారులు.

Also read:దారుణం: బలవంతంగా పురుగుల మందు తాగించి ప్రియురాలి హత్య, ఆ తర్వాత అతను...

 తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ గత ఆగస్టులో తన పూర్వీకుల భూమిని అతని పేరుపై మార్చుకున్నాడు. ప్రభుత్వ విలువకన్నా తక్కువగా రిజిష్టర్‌ పత్రాలు తీసినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలియడంతో వీటిపై వేలూరు కలెక్టరేట్‌లోని ప్రత్యేక సబ్‌ కలెక్టర్‌ దినకరన్‌ను కలవమని సూచించాడు. దీంతో ఆయన దినకరన్‌ను కలిశాడు.

ఈ పనిచేసేందుకు రంజిత్ కుమార్ ను రూ. 50వేలు లంచం ఇవ్వాలని  దినకరన్ కోరాడు.  దీంతో రంజిత్ కుమార్  ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని దినకరన్ ను పట్టుకొన్నారు.  దినకరన్ కార్యాలయంలో ఇంట్లో  సుమారు రూ. 80 లక్షల నగదుతో పాటు పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకొన్నారు.

దినకరన్ తన వద్ద పనిచేసే డ్రైవర్ రమేష్‌ను డబ్బులు వసూలు చేసేందుకు నియమించుకొన్నట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు.  ఎవరి వద్ద ఎంత డబ్బులు తీసుకోవాలనే విషయమై డ్రైవర్ రమేష్ కు జాబితాను తయారు చేసి దినకరన్ ఇచ్చేవాడు. తన కార్యాలయంలో పనిచేసే మహిళా అధికారితో దినకరన్ సన్నిహితంగా ఉండేవాడు.

తన వద్ద పనుల కోసం వచ్చే వారిని కూడ ఆ మహిళ వద్దకు పంపేవాడని అధికారులు గుర్తించారు. తనతో పనుల కోసం వచ్చే మహిళలను ఆకర్షించేవాడు. పనులు చేయాలంటే లైంగిక వాంఛలు తీర్చాలని వారి వద్ద ప్రతిపాదనలు చేసేవాడు. తమ పనులు పూర్తి కావడం కోసం కొందరు మహిళలు అతను చెప్పినట్టుగా విన్నారని కూడ అధికారులు గుర్తించారు.  మహిళలతో రాసలీలలు