ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తల్లెత్తడంతో.. అందులో ప్రయాణీస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.  దాదాపు 90 నిమిషాల పాటు పరోక్షంగా నరకం అనుభవించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 

చాలా మంది ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లేందుకు విమాన ప్రయాణం చేస్తారు. లేదంటే.. తక్కువ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా విమానంలో ప్రయాణిస్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే..  అత్యంత విలాసవంతంగా అతి తక్కువ సమయంలో సుదూర ప్రయాణం చేయడానికి విమాన ప్రయాణం చేస్తుంటారు. కానీ, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణీకుల మాత్రం తన ప్రయాణంలో భయకర పరిస్తితిని ఎదుర్కొన్నారు.

ఆ ప్రయాణం వారికి చేదు అనుభవాన్ని మిలిగ్చింది. విమానంలో ఏసీ పని చేయకపోవడంతో .. దాదాపు  90 నిమిషాల పాటు నరకం అనుభవించారు ఆ విమాన ప్రయాణీకులు. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా శనివారం తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

కాంగ్రెస్ నేత ట్వీట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. తన ఇండిగో విమాన ప్రయాణాన్ని అత్యంత భయానక అనుభవంగా అభివర్ణించారు. చండీగఢ్‌ నుంచి జైపూర్‌కు ప్రయాణిస్తుండగా.. ముందుగా ప్రయాణికులను మండే ఎండలో 10-15 నిమిషాల పాటు లైన్‌లో వేచి ఉండేలా చేశారనీ, ఆపై ఏసీ లేకుండానే విమానం బయలుదేరిందని అమరీంద్ సింగ్ చెప్పారు. ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ, విమానం టేకాఫ్, ల్యాండింగ్ వరకు ఏసీ పని చేయలేదని, ప్రయాణమంతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి  ఎవరూ ముందుకు రాలేదనీ, ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. పైగా చెమటలు తుడ్చుకోవడానికి టిష్యూ పేపర్‌ను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. వైరల్ వీడియోలో ప్రయాణీకులు గాలి వీచుకుంటున్నట్టు  కనిపిస్తున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)లను ట్యాగ్ చేస్తూ అమరీందర్ సింగ్ రాజా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Scroll to load tweet…


మరో విమానంలో సాంకేతిక సమస్య 

మీడియా కథనాల ప్రకారం..మరో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శుక్రవారం ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత ఈ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం ఉదయం 9.11 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

ఢిల్లీ నుంచి రాంచీకి తిరిగి వస్తున్న మరో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత పైలట్ ఈ విషయాన్ని ప్రకటించాడు. విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళుతున్నట్లు అధికారులు తెలిపారు.