ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం. . ఆ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిదంటే.?
లక్నో నుంచి అబుదాబి వెళ్తున్న ఇండిగో విమానం (లక్నో-అబుదాబి విమానం)లో శనివారం హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

లక్నో నుంచి అబుదాబికి వెళ్తున్న ఇండిగో విమానం శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. 155 మంది ప్రయాణీకులతో 6E 093 నంబర్ గల విమానం రాత్రి 10:42 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయింది. విమానంలో హైడ్రాలిక్ సమస్య తల్లెత్తడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అయితే.. ఈ ఘటనపై ఇండిగో నుంచి వెంటనే ఎలాంటి ప్రకటన రాలేదు.
రెండు వారాల క్రితం.. ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భువనేశ్వర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఆగస్ట్‌లో ప్రయాణీకుడికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. అంతకు ముందు ముంబై నుంచి రాంచీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు.