జమ్మూ, కట్రాలలో 'రైల్ కోచ్ రెస్టారెంట్'- ఫుడ్ లవర్స్‌కు పసందైన రుచులు
ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కట్రా, జమ్మూ రైల్వేస్టేషన్‌లలో రెండు రైల్వే కోచ్‌లను థీమ్ ఆధారిత రెస్టారెంట్లుగా మార్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు రెస్టారెంట్లకు అన్నపూర్ణ, మా దుర్గ అని పేర్లు పెట్టుకున్నారు. జమ్మూ, కట్రాలో ఏర్పాటు చేసిన ఈ రెండు రెస్టారెంట్లలో మాంసాహారం అందుబాటులో వుంటుంది.
దేశంలోని చాలా ప్రాంతాలో పాత రైలు బోగీలు రెస్టారెంట్లుగా , హోటళ్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో మరిన్ని చోట్ల ఇలాంటి వాటిని నెలకొల్పేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కట్రా, జమ్మూ రైల్వేస్టేషన్‌లలో రెండు రైల్వే కోచ్‌లను థీమ్ ఆధారిత రెస్టారెంట్లుగా మార్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ‘‘బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ ఆన్ వీల్స్’’ అని పేరు పెట్టారు. దీని కింద పాత రైలు కోచ్‌లు పునరుద్దరించబడటంతో పాటు కోచ్‌లు రెస్టారెంట్‌లుగా రూపాంతరం చెందాయి.
జమ్మూ, కట్రాలలో రెండు రైలు కోచ్ రెస్టారెంట్లు పనిచేస్తున్నాయని జమ్మూ డివిజనల్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ తెలిపారు. రెండు ప్రాజెక్ట్‌లకు వేర్వేరుగా టెండర్లు పిలిచారు. రెండు ఏసీ రెస్టారెంట్లు కలిపి ఏడాదికి రూ.50 లక్షల ఆదాయం వస్తోందని ఆయన వెల్లడించారు. ఈ ప్రణాళిక ప్రకారం తాము ఈ కోచ్‌లను ప్రైవేట్ పార్టీలకు అందిస్తున్నామన్నారు. మొదటి కోచ్ రెస్టారెంట్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని మేనేజర్ తెలిపారు. ఈ రెండు రెస్టారెంట్లకు అన్నపూర్ణ, మా దుర్గ అని పేర్లు పెట్టుకున్నారు.
కోచ్‌ని పూర్తిగా పనిచేసే రెస్టారెంట్‌గా మార్చడానికి 90 రోజులు పడుతుందని అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని ప్రదీప్ గుప్తా తెలిపారు. అవసరమైన అన్ని సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలోని తొమ్మిది నుంచి 10 ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ఇదే తరహాలో ఇప్పటికే కోచ్ రెస్టారెంట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జబల్‌పూర్, భోపాల్, లక్నో, వారణాసి వంటి స్టేషన్‌లలో ఈ తరహా రెస్టారెంట్లు అందుబాటులోకి వచ్చినట్లు మేనేజర్ వెల్లడించారు.
జమ్మూ, కట్రాలో ఏర్పాటు చేసిన ఈ రెండు రెస్టారెంట్లలో మాంసాహారం అందుబాటులో వుంటుందని, ఇవి రెండూ పూర్తిగా ఏసీ సదుపాయాన్నికలిగి వున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీకి చెందిన సుర్జీత్ సింగ్ అనే ప్రయాణీకుడు మాట్లాడుతూ.. జమ్మూలోని కోచ్ రెస్టారెంట్ల కోసం పర్యాటకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.