Asianet News TeluguAsianet News Telugu

కుక్క ఉంది జాగ్రత్త.. ఇక్కడ రూల్స్ బ్రేక్ చేశారో

చెన్నైలోని పార్క్ టౌన్ రైల్వే స్టేషన్‌లో ఓ కుక్క డ్యూటీ చేస్తోంది. ఇక్కడ రూల్స్ పాటించని వారికి వాటిని గుర్తు చేస్తుంది. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను అప్రమత్తం చేస్తుంది

Abandoned Dog Barks At Those Flouting Rules At Park Town station Chennai
Author
Chennai, First Published Nov 19, 2019, 4:38 PM IST

మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎలా నడుచుకోవాలో నియమాలు ఉన్నాయి. అయితే వాటిని పాటించే వారు చాలా తక్కువ. రైల్వే స్టేషన్ల సంగతి సరేసరి. క్యూ పద్ధతి ఉండదు, రైలు ఆగకముందే కొందరు ఎక్కేస్తారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉపయోగించకుండా పట్లాలను దాటి అవతలి పక్కకి వెళుతూ ఉంటారు.

అయితే అలాంటివన్ని తన ముందు కుదరవు అంటోంది ఓ కుక్క. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పార్క్ టౌన్ రైల్వే స్టేషన్‌లో ఓ కుక్క డ్యూటీ చేస్తోంది. ఇక్కడ రూల్స్ పాటించని వారికి వాటిని గుర్తు చేస్తుంది. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను అప్రమత్తం చేస్తుంది.

అయినా కుక్కే కదా అని ముందుకు వెళితే.. వారికి అడ్డంగా నిలబడుతుంది. అలాగే నిబంధనలు అతిక్రమించి రైల్వే ట్రాకులు దాటుతూ ఎవరైనా కనిపిస్తే మోరుగుతుంది.

రైల్వే స్టేషన్‌లలో నిబంధనలు అతిక్రమించిన వారిని హెచ్చరించడానికి ఆర్‌పీఎఫ్‌కి సహాయపడేందుకు తీసుకొచ్చిన హెల్పింగ్ డాగ్ విధానం సత్ఫాలితాలను ఇస్తోంది. పార్క్ టౌన్ రైల్వే స్టేషన్‌లో చెైన్న మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో భాగంగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios