ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో గురువారం కలకలం రేగింది. ఆయన ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో వాహనాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.

అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అంబానీ ఇంటికి పోలీసులు, డాగ్ స్క్వాడ్ చేరుకొన్నాయి. అనంరం ఆ వాహనాన్ని ఎవరు అక్కడ పార్క్‌ చేశారు, తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్టుగా గుర్తించారు. ఇందుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.