Prashant Kishor: ఆమ్ ఆద్మీ పార్టీ..జాతీయ రాజకీయాల్లో రాణించి లోక్‌సభలో ఎక్కువ సీట్లు సాధించాలంటే..ఇంకో 15-20 ఏళ్లు పట్టొచ్చని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రస్తుత తరుణంలో దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే అది సాధ్య‌మైంద‌నీ,  ఇత‌ర పార్టీలు ఈ ఘ‌త‌న సాధించాలంటే.. నిరంతర ప్రయత్నాలు చేయాల‌ని.. ఏ పార్టీ కూడా రాత్రికి రాత్రే.. జాతీయపార్టీ కాలేద‌ని అన్నారు. 

Prashant Kishor: జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే.. లోక్‌సభలో ఎక్కువ సీట్లు కైవ‌సం చేసుకోవాలంటే.. ఏదైనా రాజకీయ పార్టీ.. శక్తివంతమైన జాతీయంగా విస్తరించి ఉండాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఏ పార్టీ అయినా జాతీయ పార్టీ కావాలంటే 20కోట్ల ఓట్లు రావాలన్నారు. 2019లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 27లక్షల ఓట్లు వచ్చాయని.. అలా ఎదగడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకో 15-20 ఏళ్లు పట్టొచ్చని, నిరంతర ప్రయత్నాలు చేయాల‌ని.. ఏ పార్టీ కూడా రాత్రికి రాత్రే.. జాతీయ పార్టీగా అవ‌త‌రించ‌లేద‌ని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 

దేశంలో అనేక రాజకీయ పార్టీలు జాతీయ పార్టీ దిశగా ప్రయత్నించాయని, కానీ సాధ్యపడలేదన్నారు. రాత్రికి రాత్రే ఏదీ జరుగదని, దానికి సమయం కావాలన్నారు. ప్రస్తుత తరుణంలో దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే అది సాధ్యమని, మరే పార్టీకి ఇప్పట్లో దేశ వ్యాప్తంగా ప్రభావం చూపడం కష్టమని ఆయన అన్నారు. ప్రశాంత్ కిషోర్ మంగళవారం ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర ఆంశాల‌ను చర్చించారు.

ఏ పార్టీ అయినా జాతీయ పార్టీ కావాలంటే 20కోట్ల ఓట్లు రావాలన్నారు. 2019లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 27లక్షల ఓట్లు వచ్చాయని.. ఇప్పటి వరకు దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ మాత్రమే జాతీయ పార్టీలుగా ఆవిర్భవించాయన్నారు. సిద్ధాంతరపరంగా ఏ పార్టీ అయినా జాతీయ పార్టీగా మారొచ్చని, కానీ చరిత్రను పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా చేరుకోగలిగినట్లు తెలుస్తుందన్నారు. అయితే, అలా మరే పార్టీ చేయలేదని కాదని.. ఇందుకు 15 నుంచి 20 సంవత్సరాల పాటు నిరంతరం కష్టపడాలన్నారు. అలాంటి మార్పు ఒక్క రోజులో జరుగదన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయంపై ప్రశ్నించిన సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీపై ప్రశాంత్‌ కిశోర్ స్పందిస్తూ.. ప్రజాదరణ అంటే బెంగాల్‌ ఎన్నికల్లో ఓడిపోకూడదన్నారు.

పంజాబ్ ఎన్నికల్లో ఆప్ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ విజయం ఇతర రాష్ట్రాలలో ప్రత్యేకించి కాంగ్రెస్, బిజెపి ప్రత్యక్ష పోటీలో ఉన్న చోట విస్తరణ ప్రణాళికల శ్రేణిని ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఇది ఇప్పటికే పంజాబ్ పొరుగు రాష్ట్రమైన హర్యానాలో తన ఉనికిని చాటుకోవ‌డాని ప్ర‌య‌త్నిస్తుంది. 

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు లేవా? అని ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ బీజేపీకి 38శాతం ఓట్లు వచ్చాయని.. అంటే.. నూటికి 62శాతం మంది ఓటు వ్య‌తిరేక ఓట్లు వేశారన్నారు. ఈ లెక్కన బీజేపీకి కేవలం 38 మంది మాత్రమే ఉన్నారని, ఓటింగ్‌ సరళి పరంగా ఈ 62 మంది ఒకటికాకపోవడం వల్ల ఒక పార్టీకే లాభం చేకూరుతుందన్న విషయం తెలిసిందేనన్నారు.