అదే కోవలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కూడా సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్‌ఎల్‌ఏ, ఎంపీ, మంత్రులంతా తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని కోరారు.
భారీ వర్షాలకు జలమయమై.. వరదల్లో మునిగి తేలుతోంది కేరళ రాష్ట్రం. రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాలు ఉంటే.. 13 జిల్లాలు జలమయమయ్యాయి. 80ఏళ్లలో కనీవినీ ఎరగని.. వరదలు కేరళను ముంచెత్తాయి.
తిరిగి ఆ రాష్ట్రం కోలుకోవడానికి చాలా కాలం పట్టేలా ఉంది. చాలా మంది తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేక అవస్థలుపడుతున్నారు. ఆ రాష్ట్రానికి చేయూతను అందించేందుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. సెలబ్రెటీలు కూడా తమకు తోచినంత కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నారు.
అదే కోవలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కూడా సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్‌ఎల్‌ఏ, ఎంపీ, మంత్రులంతా తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని కోరారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కేరళకు తమ వంతు సాయంగా నెల జీతాలను అందివ్వాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా ఇప్పటికే కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.
