పంజాబ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. జిమ్ లో ఉండగా అతని మీద కాల్పులు జరిగాయి.
చండీగఢ్ : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అక్చర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్ కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. జిమ్ లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. అక్బర్ అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు నిందితుడు వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సీసీటీవీ ఆధారంగా గుర్తంచినట్లు పోలీసులు తెలిపారు. వారికోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పార్టీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది.
దారుణం.. కిరాణా సామాను కొనేందుకు వెళ్లిన 17 ఏళ్ల బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్..
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని మాదాపూర్ లో సోమవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. మాదాపూర్ లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజీబ్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకరికి గాయాలయ్యాయి. స్థిరాస్తి గొడవల వల్లే కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అయితే, రియల్ ఎస్టేట్ వివాదం కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు బాలానగర్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. ఇస్మాయిత్ కు ముజాహిదుద్దీన్ కు మధ్య గత కొంతకాలంగా వివాదం ఉందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని సందీప్ రావు తెలిపారు. వీరంతా రంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఇస్మాయిల్ పై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఇస్మాయిల్ తో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న జహంగీర్ పై కూడా కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు.
అయితే, చనిపోయిన ఇస్మాయిల్ ఘటనకు ముందు ఆదివారం నాటి రాత్రి తొమ్మిదిన్నర గంటలనుంచి నిందిుతులతో పాటే ఉన్నాడని తెలిపారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి మసాబ్ ట్యాంక్,పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో తిరిగారని డీసీపీ చెప్పారు. సోమవారం నాడు తెల్లవారుజామున పన్నెండున్నర సమయంలో మాదాపూర్ కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. మాదాపూర్ ప్రాంతంలోనే సుమారు రెండు గంటల పాటు వీరి మధ్య రియల్ ఎస్టేట్ కు సంబంధించిన అనేక విషయలు చర్చలు జరిగినట్టుగా పోలీసులు చెప్పారు.
