సింహాద్రి సినిమాలో.. హీరోకి.. విలన్ ని చంపిన తర్వాత.. పాలాభిషేకం చేస్తారు. ఈ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చంగా.. అలాంటిదే ఢిల్లీలోనూ జరిగింది. మురికి కాలువను శుభ్రం చేసేందుకు అందులోకి దూకిన ఆప్ కౌన్సిలర్ కి.. ఆ తర్వాత పాలాభిషేకం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని మున్సిపల్ ఎన్నికల పై రాజకీయ వివాదం రోజు రోజుకీ ఎక్కువౌతోంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ.. రాష్ట్రంలోని అధికార పార్టీ ఆప్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. మంగళవారం.. ఓ ఆప్ కౌన్సిలర్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆప్ కౌన్సిలర్ హసీబ్- ఉల్-హసన్ స్థానికంగా ఉన్న ఓ పార్క్ లోని మురికి కాలువలో దూకేశాడు. తూర్పు ఢిల్లీకి చెందిన AAP కౌన్సిలర్ హసీబ్-ఉల్-హసన్, శాస్త్రి పార్క్‌లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి దూకాడు.
ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానంటూ ఆయన ఆ మురికి కాలువలోకి దూకడం గమనార్హం. ఆ తర్వాత.. తన సహాయకుల సహాయంతో దానిని క్లీన్ చేయడానికి కావాల్సిన పరికరాలను అందుకొని.. దానిని శుభ్రం చేయడం మొదలు పెట్టాడు.
ఆయన ఒక్కడే దానిని మొత్తాన్ని శుభ్రం చేయడం గమనార్హం. దానిని శుభ్రం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఆయన మద్దతుదారులు పాలతో అభిషేకం చేయడం గమనార్హం. సినిమాటిక్ రేంజ్ లో.. ఆయనకు వారు పాలాభిషేకం చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కి పాలాభిషేకం చేసిన సీన్ ఉంది చూశారా.. ఇంచు మించు.. అలాంటి సీన్ ఇక్కడ కూడా జరగడం విశేషం. ఆయనను హీరో రేంజ్ లో.. అక్కడి వారు పాలతో అభిషేకం చేయడం విశేషం.
పాలాభిషేకం తర్వాత హసన్ మాట్లాడుతూ.. పార్క్ లోని కాలువ పొంగి పోర్లుతోందని.. స్థానిక అధికారులకు, బీజేపీ కౌన్సిలర్ కి చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. అందుకే... తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు ఆయన చెప్పారు.
