ఢిల్లీ టు దుబాయ్.. ఆఫ్తాబ్ పూనావాలా చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉన్నాడు: పోలీసులు
ఆఫ్తాబ్ పూనావాలా చాలా మంది మహిళలతో టచ్‌లో ఉండేవాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో అంటే ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు వివిధ ప్రాంతాల్లో ఉండే మహిళలతో ఆయన ఫ్రెండ్షిప్ ఉన్నదని వివరించారు. ఈ ఫ్రెండ్షిప్ విషయమై పూనావాలా, శ్రద్ధా వాకర్ మధ్య గొడవలు జరిగాయని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: ఆఫ్తాబ్ పూనావాలా చాలా మంది మహిళలతో టచ్‌లో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారని తెలిపారు. ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు అనేక చోట్ల ఆయనతో సన్నిహితంగా ఉండే మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా ఆఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధా వాకర్‌కు మధ్యలో తరుచూ గొడవలు జరుగుతుండేవని, వారి మధ్య రిలేషన్‌షిప్ సమస్యాత్మకంగా మారడానికి ఇదే ప్రధాన కారణమై ఉంటుందని పోలీసులు వివరించారు. పోలీసులు 6,600 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో దారుణమైన విషయాలు వెల్లడయ్యాయి.
శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హతమార్చిన తర్వాత కూడా ఆఫ్తాబ్ పూనావాలా మరో మహిళతో డేటింగ్ చేశాడని పోలీసులు వివరించారు. ఆమెను కూడా బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా అప్రోచ్ అయ్యాడని తెలిపారు. అంతేకాదు, ఆమెను ఆయన అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. శ్రద్ధా వాకర్ బాడీ పార్టులు అదే అపార్ట్‌మెంటులో ఫ్రిడ్జీలో ఉండగా ఆయన మరో మహిళతో డేట్ చేసి అదే అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్నట్టు పోలీసులు చెప్పారు.
Also Read: స్నేహితుడిని కలిసినందుకు శ్రద్దా వాకర్ ను హతమార్చిన అఫ్తాబ్ పూనావాలా : చార్జిషీట్ లో కీలక విషయాలు
ఆఫ్తాబ్ పూనావాలాను అరెస్టు చేసినప్పుడు కూడా పోలీసులు ఇదే విషయాన్ని చెప్పారు. ఆఫ్తాబ్ పూనావాలాకు చాలా మంది మహిళలతో స్నేహం ఉన్నదని, ఆ కారణంగానే శ్రద్ధా వాకర్‌కు అతనికి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని ఆరోపించారు. తాజాగా, అవే ఆరోపణలను చార్జిషీటులోనూ పొందుపరిచారు.
గతేడాది మే నెలలో ఆఫ్తాబ్ పూనావాలా ఢిల్లీలోని అపార్ట్‌మెంట్‌లో శ్రద్ధా వాకర్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె బాడీని 35 ముక్కలుగా తెగ్గొశాడు. వాటిని ఫ్రిడ్జీలో దాచి రోజులపాటు సమీపంలోని అడవిలో అర్ధరాత్రి పూట వెళ్లి పడేసి వచ్చేవాడు. ఇప్పటి వరకు పోలీసులకు 20 పీస్‌లకు తక్కువే లభించాయి. శ్రద్ధా వాకర్ హత్య కేసు ఢిల్లీ సహా యావత్ దేశాన్నే కలవరంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.