Asianet News TeluguAsianet News Telugu

ఇకపై ప్ర‌తి ప‌దేండ్ల ఒక‌సారి ఆధార్​ అప్​డేట్ తప్పనిసరి!

ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్‌లను ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. 70 ఏళ్లు పైబడిన ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేసింది. 

aadhaar uidai push biometrics update every 10 years unique identification authority of india
Author
First Published Sep 17, 2022, 6:04 AM IST

ఆధార్ అనేది భారతదేశపు అత్యంత‌ విశిష్ట గుర్తింపు కార్డు. దీనిని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ) జారీ చేస్తుంది. అందుకే మీరెప్పుడైనా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే..యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే వినియోగించాలి. 

ఆధార్ కార్డ్ అనేది కీలమైన డాక్యుమెంట్. ప్రతి పనికి ఆధార్ అవసరం. మొబైల్ సిమ్ తీసుకోవాల‌న్నా..  బ్యాంక్ లో ఖాతా తెరవాలన్నా.. క‌రెంట్ కనెక్షన్ తీసుకోవాల‌న్నా.. ట్యాప్ కనెక్షన్ కావాల‌న్నా.. ఇలా ఏ పనైనా సరే..ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఆధార్ కార్డ్ లేకుంటే.. ఈ ప‌న్నులేవి కావు.. అంతలా ఆధార్ ను ప్ర‌ముఖ్య‌త పెరిగింది. ఈ త‌రుణంలో ఆధార వినియోగంపై కాస్త అవ‌గాహ‌న అవ‌స‌రం..  ఎవ‌రికైనా మీ ఆధార్ కార్డును ఇచ్చేముందు కాస్త ఆలోచించాలి.  

అలాగే.. తాజాగా యూఐడీఐఏ ఓ కీల‌క సూచ‌న చేసింది. ప్ర‌తి ప‌దేండ్ల ఒక‌సారి ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారికి అప్​డేేట్ తప్పనిసరిగా చేసింది. అలాగే.. కాగా వయోజనులు కూడా త‌మ ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాల‌ని సూచించింది.  70 ఏండ్లు దాటిన వారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని యూఐడీఐఏ సూచించింది. దేశంలో  మేఘాలయ, నాగాలాండ్​ మినహా అన్ని రాష్ట్రాల్లో  ఉన్న వయోజనుల ఆధార్​ అప్​డేట్​ చేశామని తెలిపింది. ఎన్‌ఆర్‌సి కారణంగా మేఘాలయలో ఈ ప్రక్రియలో ఆలస్యం జ‌రిగింద‌నీ, అలాగే..  నాగాలాండ్, లద్దాఖ్​లోని ప‌లు ప్రాంతాలలో కొంత మందికి  కార్డులు మంజూరు చేయాల్సి ఉందని సంస్థ తెలిపింది.  

ప్రస్తుతం దేశంలో 93.5 శాతం మంది ఆధార్​ కలిగి ఉన్నార‌నీ,  గ‌త నెల ఆగస్టు లోనే 24.2 లక్షల మందికి ఆధార్ అంద‌జేశామ‌ని చెప్పింది. ప్ర‌స్తుతం దేశంలో దాదాపు 50,000 ఆధార్​ అప్​డేట్​ కేంద్రాలు ఉన్నాయని,  ఫోన్​ నంబర్, చిరునామాలను అప్​డేట్​ చేసేందుకు 1,50,000 మంది త‌పాల సిబ్బందిని ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. ఆధార్ అప్ డేట్ చేయ‌డం వ‌ల్ల నకిలీ లబ్ధిదారులను గుర్తించి.. నిధులు దుర్వినియోగం కాకుండా చేయ‌వ‌చ్చని సంస్థ తెలిపింది.  విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన 'డిజియాత్ర' ధ్రువీకరణ కోసం ఆధార్​ను అనుసందానం చేయబోతున్న‌ట్టు తెలిపింది. 

ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్‌ నమోదుకు బయోమెట్రిక్‌ సేకరించడం లేదు. బదులుగా UIDAI ఫేషియల్ స్కాన్ మరియు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బయోమెట్రిక్ ప్రమాణీకరణను ఉపయోగించి చిన్న పిల్లలను నమోదు చేస్తుంది. అయితే, ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు తమ బయోమెట్రిక్‌లను ఆధార్ సేవా కేంద్రంలో అందించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios