Asianet News TeluguAsianet News Telugu

కరోనా కి మందులు కొనాలంటే.. ఆధార్ తప్పనిసరి..?

 రోగులు తమకు డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వివరాలు, తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, అంగీకార పత్రాలు, కోవిడ్-19 పాజిటివ్ రిపోర్టు, కాంటాక్ట్ డీటెయిల్స్ తదితరాలన్నింటీ సమర్పించవలసి ఉంటుంది.
 

Aadhaar details, doctors' prescription now mandatory for buying two COVID-19 drug in maharastra
Author
Hyderabad, First Published Jul 11, 2020, 12:21 PM IST

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ భారినపడేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కి మందు కనిపెట్టకపోయినప్పటికీ.. కొన్ని మందులను వాడుతున్నారు.  కాగా.. కోవిడ్-19 మందులు కొనాలంటే ఇక ‘ఆధార్’ తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోగులు తమకు డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వివరాలు, తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, అంగీకార పత్రాలు, కోవిడ్-19 పాజిటివ్ రిపోర్టు, కాంటాక్ట్ డీటెయిల్స్ తదితరాలన్నింటీ సమర్పించవలసి ఉంటుంది.

యాంటీ వైరల్ డ్రగ్.. రెమ్ డెసివిర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ మెడిసిన్ ‘టోసిలిజుమాచ్’ కొనుగోలు చేయాలంటే వీటిని సమర్పించాలంటూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. కంపెనీల నుంచి వీటిని నేరుగా కొనుగోలు చేసిన అనంతరం కొన్ని  ఆసుపత్రులు వీటిని దాచిపెడుతున్నాయని, అందువల్ల కొరత ఏర్పడుతోందంటూ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్టు మంత్రి రాజేంద్ర షీగ్నే తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ మందులు అవసరం లేనివారు వీటిని కొనుగోలు చేసి హెచ్చు ధరకు బ్లాక్ లో అమ్ముతున్నట్టు కూడా తెలిసిందన్నారు. అయితే రోగుల నుంచి ఇన్ని డాక్యుమెంట్లు కోరడం సముచితం కాదని కొంతమంది డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios