నిశ్చితార్థం చేసుకునే ఓ జంట కొంచెం కొత్తగా ఆలోచించింది. నిశ్చితార్థం జరిగే వేధిక వద్దకు అందరిలా కారుల్లో వెళ్లలేదు. లారీ నడుపుకుంటూ చేరుకున్నారు. అయితే ఇక్కడ లారీ నడిపింది కాబోయే పెళ్లికూతురు కావడం విశేషం.
కేరళలోని త్రిసూర్‌లో ఓ వింత చోటు చేసుకుంది. ఓ యువతి నిశ్చితార్థం చేసుకునేందుకు లారీలో వెళ్లింది. ఇందులో పెద్దగా వింతేముంది అని అనుకుంటన్నారా ?.. ఏ వాహనం దొరక్కపోతే అందులో వెళ్లింది అనుకుంటున్నారా ?.. కాదు.. ఇక్కడ అలా జరగలేదు. ఆ యువతే స్వయంగా లారీ నడుపుతూ నిశ్చితార్థం జరిగే ప్రాంగణానికి వచ్చింది. తనతో పాటు కాబోయే భర్తను కూడా పక్కన కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేసింది. దీనిని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్రిసూర్ జిల్లా మనలూర్ కు చెందిన దలీషా అనే యువతికి చిన్న నాటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఫాదర్ డేవిస్ కూడా లారీ డ్రైవర్ కావడంతో ఆమె ఆసక్తికి మరింత పెరిగింది. చదువు పూర్తయిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించింది. కొన్నిసార్లు ఆమె తన తండ్రి లేకుండా లారీ నడిపింది. కొచ్చి నుండి పెట్రోల్ తెచ్చి మలక్‌పురం బంకుకు సరఫరా చేసేది. ఆ సమయంలో ఆమె లారీ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఓ గల్ఫ్ కంపెనీ ఆమెకు జాబ్ ఆఫర్ చేసింది.
జోషిమఠ్ సంక్షోభం మధ్య ఉత్తరాఖండ్‌లోని కర్ణప్రయాగ్‌లోనూ ఇళ్లపై పగుళ్లు.. !
ట్యాంకర్ డ్రైవర్‌గా గల్ఫ్‌లో చేరిన యువతికి జిల్లాలోని కంజిరాపల్లికి చెందిన డ్రైవర్ హాన్సన్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ జంట రెండు రోజుల కిందట నిశ్చితార్థం చేసుకుంది. సెయింట్ ఆంథోనీ చర్చిలో నిశ్చితార్థ వేడుకకు వేధికగా మారింది. అయితే అందరిలా తామూ నిశ్చితార్థానికి వెళ్తే ప్రత్యేకత ఏముంటుందని ఆలోచిందో ఏమో గానీ ఆ జంట ఓ వింత పని చేసింది.
ఆ పిల్లలను చూశాకే నిర్ణయం.. అప్పటివరకు ఇలానే: చలిలో టీ షర్ట్‌తోనే యాత్ర సాగించడంపై రాహుల్ రియాక్షన్
నిశ్చితార్థానికి ఈ జంట ప్రత్యేకంగా అలంకరించుకున్నారు. ఇంటి నుంచి చర్చికి బయలుదేరే యువతి లారీలో ఎక్కింది. తనతో పాటు పెళ్లి కుమారుడిని కూడా ఎక్కించుకొని, తన పక్కన కూర్చోబెట్టుకుంది. చక్కగా ఇంజన్ స్టార్ట్ చేసి ముందుకు కదిలించింది. ఆ లారీని నేరుగా చర్చి వద్దకు తీసుకొని వచ్చింది. లారీ దిగి చర్చి లోపలికి వెళ్లి నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే యువతి లారీ నడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
