ఆరేళ్ల పాటు ప్రేమించాడు. తీరా ఆ యువతి గర్భం దాల్చడంతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి జిల్లా ఎస్పీని కలిసి అతడిపై ఫిర్యాదు చేసింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. 

ప్రస్తుతం కాలంలో స్వచ్ఛమైన ప్రేమ కరువైంది. ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ కంటే వ్యామోహమే ఎక్కువైంది. ప్రేమించాన‌ని వెంట ప‌డ‌టం తీరా అవ‌స‌రాలు తీరిపోయాక దూరం పెట్ట‌డం ఇటీవ‌ల కాలంలో సాధార‌ణ‌మైంది. ప్రేమికుడు మోసం చేశాడ‌ని ఆందోళ‌న చేసే ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో అధికంగా వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా త‌మిళ‌నాడు (thamilnadu) రాష్ట్రంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. 

ఓ యువ‌కుడు ఆరేళ్లుగా ఆ యువ‌తిని ప్రేమిస్తున్నాన‌ని చెప్పాడు. దీంతో ఆమె అత‌డిని న‌మ్మింది. కానీ ప్రేమ పేరుతో ఆమెను అత‌డు లొంగ దీసుకున్నాడు. దీంతో ఆమె గ‌ర్భం దాల్చింది. అయితే ఆ యువ‌కుడిని యువ‌తి పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. కానీ దానికి అత‌డు నిరాక‌రించాడు. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఆ యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. త‌మిళ‌నాడులోని పుదూర్ (pudoor)కు చెందిన ఓ యువ‌తి (23)ని డీఎంకే నాయ‌కుడు మురుగ‌న్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్య‌వ‌హారం ఆరేళ్ల పాటు సాగింది.

ప్రేమించుకుంటున్న స‌మ‌యంలో వీరిద్ద‌రు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో ఆ యువ‌తి గ‌ర్భం దాల్చింది. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని యువ‌తి మురుగ‌న్ ను కోరింది. యువ‌తి ప్ర‌తిపాద‌న‌కు అత‌డు ఒప్పుకోలేదు. దీంతో మోసపోయాన‌ని గ్ర‌హించి ఆ యువ‌తి ఎస్పీ కార్యాల‌యానికి వ‌చ్చింది. ఎస్పీకి జ‌రిగిందంతా చెప్పింది. బాధితురాలికి న్యాయం చేయాల‌ని ఆయ‌న పోలీసుల‌ను ఆదేశించారు. 

తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లాలోనూ ఇటీవ‌ల ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ప్రేమిస్తున్నాన‌ని చెప్పి ఓ యువ‌కుడు యువ‌తిని మోసం చేశాడు. దీంతో ఆమె అత‌డి ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని మిట్ట‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఓ యువ‌తిని రామునిప‌ట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ప్రేమిస్తున్నాన‌ని చెప్పాడు. మూడేళ్లుగా ఇలానే చెబుతూ ఆమెను లొంగ‌దీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు. అయితే అదే స‌మ‌యంలో ఆ యువ‌తికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడ‌టం మొద‌లు పెట్టారు. అయితే ఈ విష‌యం అత‌డికి చెప్పి.. పెళ్లి చేసుకోవాల‌ని కోరింది. కానీ అత‌డు స్పందించ‌లేదు. 

ఏడాది క్రితం ఆ యువ‌తికి కుటుంబ స‌భ్యులు వేరే వ్య‌క్తితో పెళ్లి చేశారు. పెళ్లి జ‌రిగిన త‌రువాత అత‌డు మ‌ళ్లీ ఆమెతో ఛాటింగ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ప్రేమిస్తున్నాన‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెతో చెప్పాడు. త‌న వెంట రావాలని కోరారు. దీంతో ఆమె అత‌డిని న‌మ్మింది. ఇంట్లో నుంచి అత‌డితో యువ‌తి వెళ్లిపోయింది. అయితే ఆమెను అంద‌రి ముందు పెళ్లి చేసుకోకుండా క‌రీంన‌గ‌ర్ లోని ఓ కిరాయి ఇంట్లో ఉంచాడు. ఆ స‌మ‌యంలోనే యువ‌తికి తాళి క‌ట్టాడు. కొన్ని రోజులు క‌లిసి ఉన్నారు. కానీ ఇటీవ‌ల కాలంలో ఆమెను త‌ప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆమె ధైర్యం చేసింది. యువకుడి గ్రామానికి వ‌చ్చి ఇంటి ఎదుట బైఠాయించింది. న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఎవ‌రు చెప్పినా వినేది లేద‌ని ఇంటి ఎదుట కూర్చుంది.