ఐదుగురు పిల్లల్ని బిల్డింగ్ మీదినుండి కిందికి విసిరేసిందో మహిళ. ఈ అమానుష ఘటన ఆదివారం జార్ఖండ్ లో కలకలం రేపింది. జార్ఖండ్ లోని సాహెబ్ గంజ్ నగరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. ఆదివారం సాయంత్రం 7 గంటలకు సాహెబ్ గంజ్ లోని బిహారీ లాల్ మండల్ భవన్ లో 10 మంది పిల్లలు టీవీ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఆ పిల్లల్ని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన మహిళ ఒక్కొక్కరిని కిందకు విసిరేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించిన బుధన్ మండల్ కు కూడా గాయాలయ్యాయి.

పిల్లల్ని భవనం పైనుంచి విసిరేసిన మహిళ గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని పోలీసులు చెప్పారు. అయితే బాధిత పిల్లల తల్లిదండ్రులు మహిళపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. కానీ విషయం తెలిసిన పోలీసులు నిందితురాలైన మహిళను సదర్ పోలీసుస్టేషనుకు పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.