కర్ణాటకలో ఓ మహిళా కండక్టర్ గర్భిణీ మహిళ పాలిట వైద్యురాలిగా మారింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమకు.. ప్రసవంలో సహాయపడింది.
చిక్కమగలూరు : కర్ణాటక హసన్‌లో బస్సులో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ మహిళ శిశువుకు జన్మనివ్వడంలో కెఎస్‌ఆర్‌టిసి మహిళా కండక్టర్ సహకరించింది. బస్సులో పురిటినొప్పులు మొదలవ్వడంతో.. బస్సును ఓ పక్కకు ఆపారు. ప్రసవానికి ముందు ఇతర ప్రయాణీకులందరూ సురక్షితంగా దిగినట్లు కండక్టర్ నిర్ధారించారు.
తరువాత, సదరు గర్భణీ మహిళ ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం గలదని గుర్తించి ఆమెకు ఆర్థిక సహాయం అందించడానికి బస్సు సిబ్బంది, ప్రయాణికుల నుండి రూ.1,500 వసూలు చేశారు.ఈ సంఘటన బస్ నెం. చిక్కమగళూరు డిపోకు చెందిన KA 18 F 0865 బస్సులో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తున్న బస్సులో హాసన్‌లోని ఉదయపుర వ్యవసాయ కళాశాల సమీపంలో మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. సమీపంలో ఆసుపత్రి లేకపోవడంతో, లేడీ కండక్టర్ ఎస్ వసంతమ్మ బస్సును ఆపి, మొత్తం 45 మంది ప్రయాణికులను దించి, బస్సులోనే ఆడబిడ్డను ప్రసవించేలా గర్భిణికి సౌకర్యం కల్పించారు.
అనంతరం మహిళను శాంతగ్రామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి, మహిళ ఆరోగ్యంగా ఉన్నారు.
కెఎస్ఆర్టీసీ సిబ్బంది సకాలంలో అందించిన సహాయాన్ని జి సత్యవతి, ఎండీ అభినందించారు.
