గోవాలో సేద తీరేందుకు వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో పరిచయం ఉన్న ఓ వ్యక్తి రిసార్ట్ లో ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించాడు. కానీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ మహిళకు, 47 ఏళ్ల వ్యక్తికి గతంలో విమానంలో పరిచయం ఏర్పడింది. దీంతో ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఎవరికి వారు గోవాలో సేద తీరేందుకు వచ్చారు. వేరు వేరు చోట్ల రిసార్ట్స్ లో బస చేశారు. అయితే తన రిసార్ట్ చూసేందుకు రావాలని ఆహ్వానించడంతో ఆ మహిళ నమ్మి వెళ్లింది. అక్కడికి వెళ్లే సరికి గదిలోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. కానీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
డీఎస్పీ జీవ్‌బా దాల్వీ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన 47 ఏళ్ల లక్ష్మణ్ షియార్ కొంత కాలం విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో వారి మధ్య స్నేహం చిగురించింది. ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ స్నేహంతో అతడు మహిళకు అప్పుడప్పడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడు ఈ వారం మొదట్లో గోవాకు వెళ్లాడు. అతడితో సంబంధం లేకుండా మహిళ కూడా గోవాకు వెళ్లింది.
ఇద్దరూ వేరు వేరు రిసార్ట్స్ లో దిగారు. అక్కడ పర్యాటక ప్రదేశాలను సందర్శించి తమ గదికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన లక్ష్మణ్ ఆ మహిళకు ఫోన్ చేశాడు. తాను ఉంటున్న ఉత్తర గోవాలోని అస్సోనోరా రిసార్ట్ ను ఒక సారి సందర్శించాలని, ఇక్కడ ఉన్న సౌకర్యాలను చూడాలని కోరాడు. దీంతో అతడి మాటలు నమ్మి ఆమె రిసార్ట్ కు వెళ్లింది.
ఏదో ఒకటి చెబుతూ తన గదికి తీసుకెళ్లాడు. తరువాత ఆమెపై అందులో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని ఎవరికీ చెప్పకూడదని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో ఆమె భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. కానీ తాజాగా బాధితురాలు ధైర్యం తెచ్చుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు ముపుసా పట్టణం దగ్గరలో ఉన్న థివిమ్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.
