ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ వర్షపు నీటి తాకిడికి నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నదీతీర ప్రాంతాల్లోని మూగ జీవులు ఈ ఉదృత ప్రవాహానికి బలవుతున్నాయి. 

ఉత్తర కాశీ ప్రాంతంలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఈ జిల్లాలో వరద తాకిడి ఎక్కువగా ఉన్నప్రాంతాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్(స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బలగాలను రంగంలోకి దించింది. తాజాగా యమునా నది పడిన కొట్టుకుపోతున్న గుర్రాన్ని ఈ భద్రతా దళాలు తమ ప్రాణాలకు తెగించి కాపాడారు. ఉదృత ప్రవాహాన్ని కూడా లెక్కచేయకుండా నీటితో దిగి ఆ గుర్రానికి ఓ తాడు కట్టి బైటకులాగారు.

కేవలం మనుషులనే కాకుండా మూగ జీవాలను కూడా ఇలా ప్రాణాలను తెగించి కాపాడటంతో సైన్యంపై మరింత గౌరవం పెరిగిందని జంతుప్రేమికులు చెబుతున్నారు. ఈ వర్షాలు, వరదల వల్ల ఇప్పటికే చాలా మూగ జీవాలు నీటిలో కొట్టుకుపోయినట్లు వారు తెలిపారు. ఇలా ప్రతి జీవిని కాపాడుకుని మానవత్వాన్ని చాటుకోవాలని వారు సూచించారు.

వీడియో