కుక్క స్వైర విహారం.. సింగిల్ డేలో 70 మందిపై దాడి.. శునకం కోసం పోలీసుల గాలింపులు
బిహార్‌లోని భోజ్‌పూర్‌లో ఓ కుక్క స్వైర విహారం చేసింది. ఒకే ఒక్క రోజుల 70 మందిపై దాడి చేసింది. ఆరా పట్టణంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

పాట్నా: బిహార్‌లో ఓ కుక్క స్వైర విహారం చేసింది. భోజ్‌పూర్ జిల్లాలో ఆరా పట్టణంలో ఓ వీధి కుక్క ఏకంగా సుమారు 70 మందిపై దాడి చేసింది. సింగిల్ డేలో వీరందరినీ కరిచినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు. శివగంజ్, షిత్లా టోలా, మహాదేవ్ రోడ్, సదర్ హాస్పిటల్ ఏరియాల్లో బుధవారం ఈ కుక్క ఎవరు ఎదురుగా కనిపించిన వారిపై దాడి చేసిందని భోజ్‌పూర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు.
కుక్క దాడిలో గాయపడిన వారంతా జిల్లా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ కుక్క కోసం గాలింపులు ముమ్మరం చేశారు. పురపాలక అధికారులు, పోలీసులు ఈ కుక్క కోసం గాలిస్తున్నారు. పలు చోట్ల కుక్క నుంచి ప్రజలకు రక్షణ ఇవ్వడానికి సెక్యూరిటీ పర్సెన్నెల్ కూడా మోహరించినట్టు వివరించారు. ఇటీవలే ఓ రిపోర్టు బెంగళూరులో కుక్కల బెడద గురించి స్పష్టపరిచిన సంగతి తెలిసిందే.
Also Read: గన్‌తో ఓనర్‌ను కాల్చి చంపిన పెంపుడు కుక్క.. అమెరికాలో ఘటన.. ఎలా జరిగిందంటే?
బెంగళూరులో గత మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఇప్పటివరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) నష్టపరిహారం చెల్లించి 28 మంది వైద్య ఖర్చులను భరించింది. బాధితుల కోసం మొత్తం రూ.6,81,468 ఖర్చు చేసిందని అధికారిక రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. బెంగళూరులో వీధి కుక్కల పంజా విసురుతున్నాయి. గత మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయని అధికారికి రిపోర్టులు పేర్కొంటున్నాయి. అనధికారికి లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. దీంతో నగరంలోని కొన్ని వీధుల్లో నడిచేందుకు కూడా భయానక వాతావరణం నెలకొంది. నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. బెంగళూరులో గత మూడేళ్లలో 79,057 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఇప్పటివరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) నష్టపరిహారం చెల్లించి 28 మంది వైద్య ఖర్చులను భరించింది. బాధితుల కోసం మొత్తం రూ.6,81,468 ఖర్చు చేసిందని అధికారిక రిపోర్టులు పేర్కొంటున్నాయి.