9వ తరగతి చదువుతున్న బాలుడు తరచూ పాము కాటుకు గురవుతున్నాడు. మూడు నెలల్లో 9 సార్లు ఆ బాలుడిని పాము కాటేసింది. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటు చేసుకుంది.
పాము పగబడితే 12 సంవత్సరాలు వెంట పడుతుందని పెద్దలు అంటూ ఉంటారు. కొన్ని ఘటనలు చూస్తే ఈ మాట కొన్ని సార్లు నిజమే అనిపిస్తుంది. ఓ బాలుడు అనేక సార్లు పాము కాటుకు గురవుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు గడిచిన మూడు నెలల్లో ఆ బాలుడిని పాము కాటేసింది. దీనికి బయపడి ఆ బాలుడిని తీసుకొని తల్లిదండ్రులు వేరే ఊరికి వెళ్లిపోయారు. కానీ అక్కడి కూడా బాలుడికి అదే పరిస్థితి ఎదురైంది. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. కలబురగి జిల్లా చిత్తాపుర మండలంలోని హలకర్ణి గ్రామంలో ఓ బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడిని జూలై 3వ తేదీన ఒక పాము కాటు వేసింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చికిత్స అందించడంతో బాధితుడు కోలుకున్నాడు.
అనంతరం డిశ్చార్జ్ చేయడంతో బాలుడి ఇంటికి వెళ్లాడు. మూడు రోజుల తరువాత ఆ బాలుడి మళ్లీ పాము కాటుకు గురయ్యాడు. దీంతో మళ్లీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స అందించాడు. ఇలా మూడు నెలలో ఆ బాలుడిని తొమ్మిది సార్లు పాము కాటేసింది. ఇలా జరిగిన సందర్భంలో ఆరు సార్లు హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ అందించారు. మరో మూడు సార్లు నాటు వైద్యం చేశారు.
ఈ పాము కాట్ల నుంచి బాలుడిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ కుటుంబం మొత్తం సొంత గ్రామాన్ని వదిలిపెట్టింది. దగ్గరలో ఉన్న వాడి గ్రామానికి వలస వెళ్లి జీవించడం మొదలుపెట్టారు. అయితే విచిత్రంగా అక్కడ కూడా ఆ బాలుడు పాము కాటుకు గురయ్యాడు. అయితే ఇన్ని సార్లు పాము కాటుకు బాలుడు గురవుతున్నా.. ఒక్క సారి కూడా ఆ విష సర్పం ఆ బాలుడి తల్లిదండ్రులకు, అలాగే స్థానికులకు ఎవరికీ కనిపించకపోవడం గమనార్హం.
