Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ ఘ‌ట‌న‌: భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల్ని చంపి, ఇంట్లో పాతిపెట్టి.. అక్క‌డే నివాసం

Bhopal: ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారి మృతదేహాల‌ను వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే పాతిపెట్టాడు. తాను చేసిన నేరం గురించి ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, ఆల‌స్యంగా రెండు నెల‌ల త‌ర్వాత ఈ నేరం వెలుగులోకి వ‌చ్చింది. 
 

A shocking incident in Ratlam, Madhya Pradesh; Killed his wife and two children and buried them at home
Author
First Published Jan 23, 2023, 1:59 AM IST

Ratlam: ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారి మృతదేహాల‌ను వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే పాతిపెట్టాడు. తాను చేసిన నేరం గురించి ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, ఆల‌స్యంగా రెండు నెల‌ల త‌ర్వాత ఈ నేరం వెలుగులోకి వ‌చ్చింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు, స్థానికులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో ఓ వ్యక్తి తన భార్య, ఏడేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మృతదేహాలను తన ఇంటి ప్రాంగణంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితుడు వారి ప్రాణాలు తీసిన దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. హత్య చేసిన దాదాపు రెండు నెలల తర్వాత ఆదివారం సాయంత్రం మృతదేహాలను బ‌య‌ట‌కు తీసిన‌ట్టు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. ఈ హ‌త్య‌ల గురించి ఎవ‌రికీ ఎటువంటి అనుమానం కలగకుండా అదే ఇంట్లో నిందితుడు నివసించాడని పోలీసులు వెల్ల‌డించారు.  

రత్లాం పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారని కొందరు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అనంతరం అదృశ్యమైన వ్యక్తుల గురించి నిందితుడిని ప్రశ్నించారు. దీంతో చివరకు వారిని చంపినట్లు ఒప్పుకున్నాడు. వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాలను పాతిపెట్టిన స్థ‌లం నుంచి తవ్వి తీసిన‌ట్టు తివారీ తెలిపారు. వారి ప్రాణాలు తీయ‌డానికి గొడ్డలితో దాడి చేశానని నిందితుడు చెప్పాడని, గొడవల కారణంగానే కోపంతో హత్య చేశానని నిందితుడు చెప్పిన‌ట్టు పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మ‌రిన్ని వివరాలు వెల్లడిస్తామని, డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. మృతదేహాలు నిందితుడి భార్య, ఇద్దరు మైనర్ పిల్లలవ‌ని తెలిపారు. 

నిందితుడితో పాటు మృతదేహాలను పూడ్చేందుకు సహకరించిన సహచరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గత వారం, మధ్యప్రదేశ్ పోలీసులు 48 గంటల్లో హత్య కేసును ఛేదించారు. బద్నావర్‌కు చెందిన 35 ఏళ్ల దిలీప్ పాటిదార్ అనే బాధితుడిని అతని భార్య, ఆమె ఇద్ద‌రి సహాయకుల‌ సహాయంతో హత్య చేసినట్లు ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. ఆమెతో సంబంధం ఉన్న విషయం భర్తకు తెలియడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె సహ నిందితులతో కలిసి కుట్ర చేసి దిలీప్ తలను బండరాయితో పగులగొట్టి హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. 

ఫోన్ స్నాచింగ్ ను ప్రతిఘటించినందుకు యువకుడిపై క‌త్తితో దాడి... 

ఫోన్ స్నాచింగ్ ను ప్రతిఘటించినందుకు ఢిల్లీ యువకుడిపై క‌త్తితో దాడి చేసి.. అత‌ని గొంతు కోసి హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం టెలిఫోన్ మొహల్లాలోని రాధా కృష్ణ మందిర్ సమీపంలో మృతదేహం పడి ఉందని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ కు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి (సుమారు 18 ఏళ్ల) మృతదేహాన్ని శరీరమంతా కత్తిపోట్లతో, గొంతుపై లోతైన కత్తిపోటు గుర్తులతో స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని గుర్తించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. మృతుడిని భాటి మైన్స్ లోని సంజయ్ కాలనీలోని కలు రామ్ చౌక్ లో నివసించే హర్ష్ గా అతని అమ్మమ్మ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ద‌ర్యాప్తులో భాగంగా స్థానికుల‌ను ప్ర‌శ్నించ‌డంతో పాటు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల‌ను ప‌రిశీలించ‌డంతో స్నాచింగ్, క‌త్తితో దాడి విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios