గాలి పటాలు పైకి ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజా వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా యూపీలోని జిజ్నోర్ జిల్లాలో ఓ ఏదేళ్ల బాలుడు గాలి పటం ఎగరేస్తున్న సమయంలో మాంజా వల్ల కరెంటు వైర్ తెగింది. అది బాలుడి మీద పడటంతో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. 

క‌రెంటు తీగ త‌గిలి ఓ ఏదేళ్ల బాలుడు మృతి చెందాడు. గాలిప‌టం ఎగురేస్తున్న క్ర‌మంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బిజ్నోర్ జిల్లా నగినా ప్రాంతంలో జ‌రిగింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రం జిజ్నోర్ (Bijnor)జిల్లాలోని మోహల్లా ప‌హాడీ ద‌ర్వాజా (Mohalla Pahadi Darwza) ప్రాంతానికి చెందిన ఐదు సంవ‌త్స‌రాల బాలుడు గాలి ప‌టం ఎగురవేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆ గాలి ప‌టం వెళ్లి ఇంటి స‌మీపంలోని క‌రెంట్ వైర్ కు త‌గిలింది. గాలి ప‌టం మాంజా స్ట్రాంగ్ గా ఉండ‌టంతో క‌రెంటు వైర్ తెగి కింద ప‌డింది. అయితే ఆ వైర్ బాలుడికి త‌గ‌ల‌డంతో విద్యుత్ షాక్ కు గుర‌య్యాడు. దీనిని త‌ల్లిదండ్రులు గ‌మ‌నించి వెంట‌నే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే ఆ బాలుడు మృతి చెందాడ‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. కాగా ఆ బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌కుండానే పూడ్చిపెట్టారు. 

గ‌త కొంత కాలంగా గాలి ప‌టాలు ఎగుర‌వేయ‌డానికి ఉప‌యోగించే చైనా మాంజాల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. గతేడాది ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గాలిపటం దారం వ‌ల్ల ఓ 23 ఏళ్ల యువ‌కుడి గొంతు తెగింది. దీంతో ఆ యువ‌కుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆగస్టు 2021లో ఔటర్ ఢిల్లీ (Delhi) లోని మంగోల్‌పురి-సుల్తాన్‌పురి ఫ్లైఓవర్‌పై జరిగింది. బాధితుడిని నజాఫ్‌గఢ్‌కు చెందిన సౌరవ్ దహియాగా గుర్తించారు. దహియా ఆ స‌మ‌యంలోనే గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఆ యువ‌కుడు మాంజా వ‌ల్ల మృతి చెందాడు. 

2021 సెప్టెంబరులో UPలోని మీరట్‌ (Meerut)లోని మోడీపురంలో జరిగిన మరో ఘటనలో మాంజా వ‌ల్ల యువ‌కుడి గొంతు తెగి మృతి చెందాడు. ఖటోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్‌పూర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల అజయ్ గొంతుకు మాంజా త‌గ‌లడంతో తీవ్ర ర‌క్త స్రావం జ‌రిగింది. దీంతో ఆయ‌న చ‌నిపోయాడు.2021 డిసెంబర్ 27న ఒడిశా (odisha) రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన యువకుడు కూడా ఈ మాంజా వ‌ల్ల‌నే చ‌నిపోయాడు. కటక్ జిల్లా భైర్‌పూర్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. జయంత్ సమల్ అనే యువ‌కుడు తన భార్యతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో మాంజా ఆయన గొంతుకు చిక్కుకొని గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు.

ఈ ఏడాది సంక్రాంత్రి స‌మ‌యంలో తెలంగాణ (telangana)లోని మంచిర్యాల (Mancherial) జిల్లాలో కూడా ఇలాంటి విషాద‌మే చోటు చేసుకుంది. సంక్రాంత్రి రోజున భీమ‌య్య (bheemaiah) దంప‌తులు బైక్ పై వెళ్తున్నారు. అయితే ఈ స‌మ‌యంలో వైక్ న‌డుపుతున్న భీమ‌య్య కు గొంతుకు మాంజా చుట్టుకుపోయింది. బైక్ వేగంగా ఉండ‌టంతో తీవ్ర ర‌క్త స్రావం అయ్యింది. వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకువెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. సంక్రాంత్రి రోజునే ఇది జ‌ర‌గ‌డం తీవ్ర విషాదం నింపింది. చైనీస్ మాంజాపై దేశవ్యాప్త నిషేధం ఉంది. అయినా ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన దారం బ‌హిరంగంగానే అమ్ముతున్నారు. వీటిని వినియోగ‌దారులు కూడా అధికంగానే కొనుగోలు చేస్తున్నారు.