మహారాష్ట్రలో వరుస భూకంపాలు.. 10 నిమిషాలు అంతా గందరగోళం..
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 10 నిమిషాల వ్యవధిలో వరుస భూకంపాలు సంభించాయి. గురువారం ఉదయం 06.08 గంటలకు మొదటి, ఉదయం 06.09 గంటలకు రెండో సారి ప్రకంపనలు సంభవించాయి.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో గురువారం ఉదయం వరుసగా రెండు భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 6:08 గంటలకు మొదటి ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. 10 నిమిషాల తర్వాత ఉదయం 6.19 గంటలకు రెండోసారి భూప్రకంపనలు సంభవించగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
ఫోన్ కాల్ లీక్ వివాదం.. ఆర్డీవో పై సీఎస్ కు ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం..
‘‘భారత కాలమానం ప్రకారం నేటి (గురువారం) ఉదయం 06.08 గంటలకు మహారాష్ట్రలోని హింగోలిలో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా ఉంది’’ అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
మరో భూకంపాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ భారత కాలమానం ప్రకారం 06:19 గంటలకు హింగోలిలో 10 కిలో మీటర్ల లోతులో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది’’ అని పేర్కొన్నారు.
కాగా.. హింగోలి జిల్లా కలమ్నూరి తాలూకాలోని జాంబ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నాందేడ్ విపత్తు నిర్వహణ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నాందేడ్ లోని కొన్ని ప్రాంతాలు, జిల్లాలోని అర్ధాపూర్, ముద్ ఖేడ్, నైగావ్, దేగ్లూర్, బిలోలి తాలూకాల్లో భూప్రకంపనలు సంభవించాయని తెలిపింది.