ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా... సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన విషయాలను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి ట్వీట్ ఒకటి ఆయన చేశారు.

Also Read ఆటో దిగ్గజాలు ఆనంద్ వేణు శ్రీనివాస్‌లకు ‘భూషణ్‘.. 9 మందికి పద్మ శ్రీ...

జీవితం ఆనందంగా సాగాలంటే ఇదే మంచి ప్రిస్కిప్షన్ అంటూ ఆయన ఓ ఛార్ట్ ని షేర్ చేశారు. జపాన్ వాళ్లు ఇదే ఛార్ట్ ని ఫాలో అవుతారు. దానినే ఐకీగాయ్ అంటారు. ఐకీగాయ్ అంటే... ‘‘ ప్రతి ఉదయం లేవడానికి కారణం’’ అనే అర్థం వస్తుంది. జపనీస్ ఫిలాసఫీ ప్రకారం.. ఈ ఐకీగాయ్ లో పది సూత్రాలు ఫాలో అవతారు. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే.. జీవితం  చాలా అందంగా, ఆనందంగా సాగుతుందని ఆయన అంటున్నారు.

ఈ రోజు రాత్రి పడుకొని.. ఉదయాన్నే లేస్తున్నావు అంటే.. ఏదో ఒక కారణం ఉండాలి కదా... ఈ పది రూల్స్ పాటిస్తే.. ప్రతి ఉదయానికీ ఒక అర్థం ఉంటుందనేది ఆనంద్ మహీంద్రా అభిమతం.

 

ఆ  చార్ట్ తో పాటు.. దానిపై తన అభిప్రాయాన్ని కూడా ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘‘ నేను ఈ ఫిలాసఫీ గురించి నాకు పెద్దగా తెలీదు. కానీ.. ఇందులోని సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడానికి పీహెచ్ డీ మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రోజూ ఉదయం లేవగానే దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ చార్ట్ చూడటం చాలా అవసరం’’ అంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.  ఆ చార్ట్ లో చాలా కీలక విషయాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఏమేమి చేయాలో దాంట్లో స్పష్టంగా రాసి ఉండటం గమనార్హం.