ఫ్రెండ్‌కు రూ. 2 వేలు పంపి.. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటే రూ. 753 కోట్లు.. అసలేం జరిగిందంటే..

ఓ వ్యక్తి తన స్నేహితుడికి రూ. 2 వేలు బదిలీ చేసి.. ఆ తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుని ఆశ్చర్యపోయాడు. పూర్తిగా షాక్‌ తిన్నాడు. ఎందుకంటే.. అతని బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 753 కోట్లు అని చూపించింది.

A pharmacy worker ransfers Rs 2,000 to friend and finds Rs 753 crore in own account in tamil nadu ksm

ఓ వ్యక్తి తన స్నేహితుడికి రూ. 2 వేలు బదిలీ చేసి.. ఆ తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుని ఆశ్చర్యపోయాడు. పూర్తిగా షాక్‌ తిన్నాడు. ఎందుకంటే.. అతని బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 753 కోట్లు అని చూపించింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. తిరునెల్వేలి జిల్లాకు చెందిన మహమ్మద్ ఇద్రీస్ చెన్నైలోని తీనాంపేటలోని ఎల్డామ్స్ రోడ్‌లో నివసిస్తున్నాడు. అక్కడికి సమీపంలోని ఓ ఫార్మసీలో ఇద్రీస్ పనిచేస్తున్నాడు. అతడు కోటక్ మహీంద్రా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నాడు. అయితే ఇద్రీస్ తన ఖాతాలో రూ. 3 వేలు ఉండగా.. అందులో నుంచి రూ. 2 వేలను శుక్రవారం ఉదయం  తన స్నేహితుడికి బదిలీ చేశారు. 

ఆ తర్వాత కాసేపటికే ఇద్రీస్ బ్యాంక్ ఖాతాలో రూ. 753 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపించింది. దీంతో ఇద్రీస్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే సాంకేతిక లోపం వల్ల తప్పుగా డబ్బులు జమ అయినట్టుగా గుర్తించిన తెనాంపేటలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖ అధికారులు ఆ ఖాతాను స్థంభింపజేశారు.  అయితే తాను బ్యాంకును సంప్రదించగా అధికారులు సరిగా స్పందించలేదని ఇద్రీస్ చెబుతున్నారు. బ్యాంకు శాఖ అధికారులు సరైన వివరణ ఇవ్వలేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు.


తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ తన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఖాతాలో రూ. 9,000 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పరిస్థితిని సరిదిద్దింది. అలాగే తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో రూ. 756 కోట్లు కూడా జమ అయినట్టుగా నివేదించిన సంగతి తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios