భారతదేశ ఆధునిక చిత్రకారుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న నందనాల్ బోస్.. రాజ్యాంగం ఒరిజినల్ కాపీలో పెయింటింగ్స్ వేశారు. తన పెయింటింగ్స్ లో విదేశీ టెక్నాలజీని కూడా వాడుకున్నారు. 

భారత దేశంలో గొప్ప చిత్రకారుడిగా పేరుగాంచిన నందలాల్ బోస్ తన అభిరుచితో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. అనేక ఇతర భారతీయ చిత్రకారుల మారిగా ఆయ‌న‌కు కుటుంబం నుంచి పెద్ద‌గా మ‌ద్ద‌తు లేదు. కానీ సొంత అభిరుచి, సామర్థ్యంపై అతడికి ఉన్న నమ్మకం చివరికి ఆయ‌న‌ను 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ భారతీయ చిత్రకారులలో ఒకరిగా మార్చింది. 

1882 డిసెంబ‌ర్ 3వ తేదీన బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో జన్మించిన బోస్.. తన కెరీర్‌లో ప్రభుత్వ నమ్మకాన్ని గౌరవాన్ని సంపాదించారు ఎందుకంటే స్వతంత్ర భారత ప్రభుత్వం ఆయ‌న‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను కేటాయించింది. నందలాల్ బోస్ ఎక్కువగా భారతీయ విషయాలను చిత్రీకరించాడు. చిత్రాల‌ను గీసేందుకు ఆయ‌న విదేశీ టెక్నాల‌జీని, ముఖ్యంగా యూరప్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించేందుకు కూడా వెన‌కాడ‌లేదు. ప్రముఖ చిత్రకారుడు అబనీంద్రనాథ్ ఠాగూర్‌కు అత్యంత ఇష్టమైన విద్యార్థులలో ఆయ‌న ఒక‌రు. భారతీయ కళకు నందలాల్ అందించిన సహకారం అపారమైనది. దీనికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 

నందలాల్ బోస్ ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో క్షేత్రమోని దేవి, పూర్ణచంద్రబోస్ దంపతులకు జన్మించాడు. అతడి తండ్రి దర్భంగా రాజా కింద మేనేజర్ గా ప‌ని చేస్తుండ‌గా.. తల్లి గృహిణిగా ఉండేవారు. ఆయ‌న‌కు మొదటి నుంచి పెయింటింగ్‌పై ఆసక్తి ఉండేది. తన తల్లి క్షేత్రమణి దేవి మట్టి బొమ్మలు వంటివి చేసి ఇవ్వ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ఈ ఇష్టం పెరిగింది. చివ‌రికి ఆయ‌న‌ను త‌ల్లిదండ్రులు ఆర్ట్‌ స్కూల్‌లో చేర్పించారు. ఈ విధంగా 5 సంవత్సరాలు అతను సరైన పెయింటింగ్ విద్యను అభ్యసించారు.

అతను 1905 నుండి 1910 వరకు కలకత్తా ప్రభుత్వ కళా కళాశాలలో అబనినాథ్ ఠాగూర్ నుండి కళా పాఠాలు నేర్చుకున్నారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌లో బోధించాడు. 1922 నుండి 1951 వరకు శాంతినికేతన్‌లోని కళా భవన్‌కు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. నంద‌న్ లాల్ బో స్ త‌న సొంత చిత్రాల‌తో భారత రాజ్యాంగం ఒరిజిన‌ల్ కాపీని అలంక‌రించే అవ‌కాశాన్ని పొందారు. ఆయ‌న శాంతినికేతన్‌లో పండిట్ నెహ్రూని క‌లుసుకున్నారు. దీంతో ఆయ‌న రాజ్యాంగాన్ని పెయింటింగ్స్ తో అలంక‌రించాల‌ని నంద‌న్ లాల్ ను కోరారు. 

221 పేజీలు ఉన్న రాజ్యాగంంలోని ప్ర‌తీ పేజీలో చిత్రాలను గీయడం సాధ్యం అయ్యే ప‌ని కాదు. అందులో వ‌ల్ల రాజ్యాంగంలోని 22 భాగాల్లోని ప్రారంభ పేజీల్లో 8-13 అంగుళాల చిత్రాలను రూపొందించారు. దీంతో అత‌డు త‌న 22 చిత్రాల‌ను రాజ్యాంగంలో పొందుప‌రిచి చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. ఈ 22 పెయింటింగ్స్‌ చేయడానికి నాలుగేళ్లు పట్టింది. దీని కోసం ఆయ‌న‌కు ఆ స‌మ‌యంలో రూ. 21,000 రెమ్యునరేషన్ అందించారు. అయితే నందలాల్ బోస్ వేసిన ఈ పెయింటింగ్‌లకు భారత రాజ్యాంగానికి కానీ, దాని సృష్టి ప్ర‌క్రియ‌కు గానీ ఎలాంటి సంబంధ‌మూ లేదు. నిజానికి ఈ చిత్రాలు భారతదేశ చరిత్ర, అభివృద్ధి ప్రయాణాన్ని సూచిస్తాయి. 

1903లో నంద‌లాల్ బోస్ స్నేహితుల కుటుంబం నుంచి సుధీరాదేవిని వివాహం చేసుకున్నారు. 1956లో లలిత కళా అకాడమీకి ఫెలోగా ఎన్నికైన రెండో క‌ళాకారుడిగా బోస్ నిలిచారు. 1954లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. కలకత్తాలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సిల్వర్ జూబ్లీ మెడల్‌తో బోస్‌ను సత్కరించింది. ఠాగూర్ బర్త్ సెంటెనరీ మెడల్‌ను 1965లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అత‌డికి ప్రదానం చేసింది.

1976లో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖలో భాగమైన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బోస్ పెయింటింగ్స్ ను ప్ర‌చురించింది. అయితే ఇవి పురాత‌న వ‌స్తువులు కాదని, వీటిని క‌ళా సంప‌ద‌గా ప‌రిగ‌ణించాల‌ని సూచించింది. ఎంతో గొప్ప చిత్ర‌కారుడిగా పేరు తెచ్చుకున్న నంద‌లాల్ 1966 సంవ‌త్స‌రం ఏప్రిల్ 16వ తేదీన క‌ల‌క‌త్తాలో మ‌ర‌ణించారు.