Asianet News TeluguAsianet News Telugu

Kerala: బిగ్ బ్రేకింగ్! CPIM  కార్యాలయంపై బాంబు దాడి.. కేరళలో ఉద్రిక్త‌త‌  

Kerala: కేరళ రాజధాని తిరువనంతపురంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గురువారం అర్థరాత్రి బాంబు దాడి జ‌రిగింది.  

A Man on a Two-wheeler Captured on CCTV Hurls a Bomb at CPI Headquarters
Author
Hyderabad, First Published Jul 1, 2022, 2:35 AM IST

Kerala: కేరళ రాజ‌ధాని తిరువనంతపురంలో బాంబు దాడి క‌ల‌క‌లం రేపింది. న‌గరంలోని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐఎం) ప్రధాన కార్యాలయంపై బాంబు విసిరిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న గురువారం  రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ.. ఈ దాడిలో ఎవ్వ‌రికీ  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సీపీఎం ప్రధాన కార్యాలయం తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్‌పై బాంబు దాడి జరిగింది. కేంద్రం బయట పెద్ద చప్పుడు వినిపించిందని ఇక్కడే ఉంటున్న వామపక్ష నేతలు తెలిపారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు సంయమనం పాటించాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటేజీలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గేటు దగ్గర ఏదో విసురుతున్నాడు. కొద్దిసేపటికి పెద్ద చప్పుడు వినిపించింది. ఈ ఘటన తర్వాత గందరగోళం నెలకొంది. అక్కడ సీపీఐ(ఎం) కార్యకర్తలంతా హాజరయ్యారు.

ఈ దాడిపై తిరువనంతపురం కమిషనర్ జి స్పర్జన్ కుమార్ స్పందించారు. ఎకెజి సెంటర్‌లో అర్థరాత్రి బాంబు పేలుడు ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం ఈ విచారణ ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. 

 రెచ్చగొట్టే ప్రయత్నం 

అదే సమయంలో ఈ దాడి అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ దాడితో యూడీఎఫ్‌ను రెచ్చగొట్టేందుకు ఏకేజీ ప్రయత్నిస్తున్నారు. దీనిపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తామ‌ని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios