Asianet News TeluguAsianet News Telugu

Omicron: సౌతాఫ్రికా నుంచి ఢిల్లీ.. అటు నుంచి ముంబయి.. పాజిటివ్ తేలడంతో తోటి ప్రయాణికుల కోసం వెతుకులాట

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి మన దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కేప్ టౌన్ నుంచి దుబాయ్ మీదుగా ఈ నెల 24న ఢిల్లీ చేరుకన్న ముంబయి వాసి అనంతరం మరో ఫ్లైట్‌లో మహారాష్ట్రకు చేరాడు. ముంబయి చేరిన తర్వాత ఆయనకు పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్‌లోకి పంపారు. ఇప్పుడు ఆయన తోపాటు విమానంలో ప్రయాణించినవారిని ట్రేస్ చేసే పనిలో అధికారులు పడ్డారు.
 

A man came from south africa reached mumbai via delhi tested corona positive
Author
Mumbai, First Published Nov 29, 2021, 1:47 PM IST

ముంబయి: చిన్న చిన్న తప్పిదాలే పెద్ద సమస్యకు బీజం వేస్తాయన్న సంగతి తెలిసిందే. Coronavirus కొత్త వేరియంట్ Omicronపై ఆందోళనలు వెలువడుతున్నా.. విదేశాల నుంచీ.. అదీ New Variant కనిపించిన దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు ఇంకా భారత్‌కు వస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా(South Africa) నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీ(Delhi) చేరాడు. అక్కడ కరోనా టెస్టు కోసం శాంపిల్స్ ఇచ్చి Mumbai వచ్చాడు. ముంబయి నగరానికి చేరిన తర్వాత ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వెంటనే ఆయనను క్వారంటైన్‌లో ఉంచి ఆయన తోటి ప్రయాణికులు ఎవరనేది ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే, ఆ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నదా? లేదా? అనేది ఇప్పటికైతే తెలియదు. ఆ విషయాన్ని నిర్ధారించడానికి నమూనాలు పంపారు.

ముంబయిలోని డోంబివలీకి చెందిన 32ఏళ్ల వ్యక్తి ఈ దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ నుంచి భారత్‌కు బయల్దేరాడు. దుబాయ్ మీదుగా ఈ నెల 24న ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం శాంపిల్స్ ఇచ్చాడు. కరోనా టెస్టు కోసం నమూనాలు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా ముంబయి వెళ్లడానికి అధికారులు అనుమతించారు. ముంబయి చేరిన తర్వాత ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనలో కరోనా లక్షణాలేవీ లేకున్నా.. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన స్వతహాగా హోం క్వారంటైన్ చేసుకున్నాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆయనను గుర్తించిన కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచింది. ఈ విషయాన్ని కళ్యాణ్ డోంబివలీ మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) చీఫ్ మెడికల్ అధికారి ప్రతిభా పన్‌పాటిత్ వెల్లడించారు. అంతేకాదు, తాము విమానశ్రానికి చెందిన అధికారులకూ విషయాన్ని చేరవేశామని తెలిపారు. సదరు వ్యక్తితో పాటు అదే విమానంలో ప్రయాణించిన వారిని ట్రేస్ చేసే ప్రక్రియ జరుగుతున్నదని వివరించారు. అయితే, ఆ వ్యక్తి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు అదనపు ప్రధాన కార్యదర్శి(ఆరోగ్యం) డాక్టర్ ప్రదీప్ వ్యాస్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారా? లేదా? అనేది తెలియదని వివరించారు.

Also Read: Omicron: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

నవంబర్ 11న కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టు చేరగానే ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం శాంపిళ్లు ఇవ్వాలి. ఆ తర్వాత వారు ఎయిర్‌పోర్టు వదిలి వెళ్లిపోవచ్చు. అయితే, వారం పాటు వారు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజున మరోసారి తప్పకుండా కరోనా టెస్టు చేసుకోవాలనే నిబంధన ఉన్నది. కానీ, ఆ వ్యక్తి ఇంతలో మరో ఫ్లైట్‌లో ప్రయాణించి ముంబయి నగరం చేరుకున్నారు.

ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే.  వారిద్దరినీ వెంటనే క్వారంటైన్(Quarantine) సెంటర్‌కు పంపారు. అయితే, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ సీక్వెన్సింగ్ ద్వారా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వారికి సోకిందా? లేదా? అనే విషయం తెలియనుంది. 

కరోనా హై రిస్కు ఉన్న దేశాల నుంచి 584 మంది పౌరులు బెంగళూరుకు వచ్చినట్టు బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్ శనివారం వెల్లడించారు. ఇందులో కేవలం దక్షిణాఫ్రికా నుంచే వచ్చిన వారు 94 మంది ఉన్నట్టు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారందరికీ కరోనా టెస్టు చేశారు. ఈ టెస్టుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు వివరించారు. దీంతో వెంటనే వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే, వారికి సోకింది కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రానేనా? కాదా? అనే విషయం ఇప్పటికైతే తెలియదని, అది తేల్చడానికి టెస్టులకు పంపామని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios