బీహర్ లో ఘోరం జరిగింది. ఓ మహిళను పని ఉందని ఇంటికి పిలిపించుకున్న నాయకుడు..ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేేసేందుకు ఆమె వెళ్తుండగా అడ్డుకున్నాడు. ఈ ఘటనను చుట్టుపక్కల వ్యక్తులు గమనించి నిందితుడిని, అతడి అనుచరులను చితకబాదారు.
ఇంట్లో పని చేయాలని ఓ మహిళను పిలిచి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు రాజకీయ నాయకుడు. అయితే ఆమె అతడి నుంచి స్థానికుల సహాయంలో ఎలాగో తప్పించుకుంది. అయితే అతడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వైపు వెళ్తుంటే ఆమె వెంట నిందితుడు, మరో ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకొచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన బాటసారులు పోలీసు స్టేషన్ సమీపంలోనే ఆ నేతను, మరో ఇద్దరిని చితకబాదారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.
బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లాలో ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అధికారిక పార్టీ అయిన జనతాదళ్-యునైటెడ్ (జేడీ-యూ) నాయకుడు, ఆ పార్టీ కార్మిక విభాగం రోహ్తాస్ జిల్లా అధ్యక్షుడు మోడ్ నారాయణ్ సింగ్ ఇందులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని డెహ్రీ పట్టణంలోని తన అధికారిక నివాసంలో పని ఉందని నిందితుడు ఓ మహిళను పిలిచాడు. అయితే ఆమె ఇంట్లోకి రాగానే డోర్ కు తాళం వేశాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పై అంతస్తులోకి పరిగెత్తింది. సహాయం కోసం తీవ్రంగా అరించింది. దీంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఆమెను రక్షించారు.
అనంతరం ఆమె ఈ ఘటనపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వెళ్లింది. అయితే ఆమెను నిందితుడ, అతడి ఇద్దరు బాడీ గార్డ్ లు వెంబడించారు. ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ ఎదుట అడ్డగించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ నిందితుడిని ఆమె పోలీసు స్టేషన్ సమీపంలో చాలా సార్లు చెప్పుతో కొట్టింది.
ఓ మహిళ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడాన్ని అటుగా వెళ్తున్న బాటసారులు గమనించారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మహిళకు సపోర్ట్ గా నిలిచి ఆ ముగ్గురిని చితకబాదారు. అయితే వారంతా తమను తాము రక్షించుకోవడానికి మహిళా పోలీసు స్టేషన్ లోకి పరిగెత్తారు. ఈ ఘటనపై రోహ్తాస్ పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ భారతి మాట్లాడుతూ.. ‘‘ బాధితురాలి నుండి మాకు ఫిర్యాదు అందింది. ఈ విషయం ప్రస్తుతం విచారణలో ఉంది. దర్యాప్తు తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాము ’’ అని తెలిపారు.
