కోల్‌కతాలోని ఓ చర్మశుద్ధి కార్మాగారానికి చెందిన గోడౌౌన్ శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం కోల్‌కతాలోని ఓ గోడౌన్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇంకా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతా (Kolkata)లోని తంగ్రా (tangra) ప్రాంతంలోని మెహర్ అలీ లేన్ (Mehar Ali Lane)లో ఉన్న చర్మశుద్ధి కర్మాగార గోడౌన్ (godown)లో శ‌నివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజ‌న్ తో కూడిన భారీ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపింది.

శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో చర్మశుద్ధి కర్మాగారానికి సంబంధించిన గోడౌన్ లోమంటలు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న విష‌యంలో డివిజనల్ అగ్నిమాపక అధికారి దేబ్తాను ఘోష్ (Debtanu Ghosh) మాట్లాడుతూ.. ‘‘ గోడౌన్‌లో కొన్ని మండే పదార్థాలు ఉండటంతో మేము లోపలికి ప్రవేశించలేకపోయాము. దీంతో 10 గంటలు దాటినా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పే సమయంలో ఇద్దరు అగ్నిమాపక దళ సిబ్బంది గాయపడ్డారు.’’ అని తెలిపారు. 

ప్రస్తుతం వరకు ఉన్న స‌మాచారం మేర‌కు 12 గంటల తర్వాత కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మంటలను ఆర్పేందుకు 15 ఫైర్ ఇంజ‌న్లు ప్ర‌య‌త్నం కొన‌సాగిస్తున్నాయి. అయితే గోడౌన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఢిల్లీలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ గోకుల్‌పురి ప్రాంతంలోని (Gokulpuri area) మురికివాడల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.