మొహాలీ: ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. కొడుకు సుఖ్వీందర్ సింగ్ మృతి చెంది ఉండగా, అదే గదిలో వేరే బెడ్‌పై ఉన్న అతని తండ్రి బల్వంత్ సింగ్ మాట్లాడలేక, కదలలేని స్థితిలో ఉన్నాడు.  

చండీగఢ్: కొన్ని రోజులుగా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు ఎవ‌రూ రావ‌డం లేదు. దీనికి తోడు దుర్వాస‌న రావ‌డం మొద‌లైంది. అప్ర‌మ‌త్త‌మైన ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు దీని గురించి కాల్ చేసి చెప్పారు. పోలీసులు అక్క‌డి చేరుకుని ఇంట్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. త‌లుపు తట్ట‌గా ఎవ‌రూ తీయ‌లేదు. దీంతో స్థానికుల సాయంతో పోలీసులు బ‌ల‌వంతంగా త‌లుపుతు తెరిచి లోప‌లికి వెళ్లారు. లోప‌ల రూం లోకి వెళ్లి చూడగా వారు షాక్ కు గుర‌య్యారు. చ‌నిపోయి.. దుర్వాస‌న వ‌స్తున్న కొడుకు మృత‌దేహం ఉన్న బెడ్ ప‌క్క‌నే అత‌ని తండ్రి ఉన్నాడు. మాట్లాడలేక, కదలలేని స్థితిలో ఉన్నాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న చండీగఢ్ లో చేటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. మోహాలీలో ఒక ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. కొడుకు సుఖ్వీందర్ సింగ్ మృతి చెంది ఉండగా, అదే గదిలో వేరే బెడ్‌పై ఉన్న అతని తండ్రి బల్వంత్ సింగ్ మాట్లాడలేక, కదలలేని స్థితిలో ఉన్నాడు. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కనీసం నాలుగు రోజులుగా తన కుమారుడి మృతదేహంతో తమ మొహాలీ ఇంటిలో నివసిస్తున్న 82 ఏళ్ల వ్యక్తిని సోమవారం నగర పోలీసులు రక్షించారు. బల్వంత్‌ సింగ్‌ తన దత్తపుత్రుడు సుఖ్‌విందర్‌ సింగ్‌తో కలిసి నివసించిన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

"శవం పక్కనే ఓ వృద్ధుడు ఉన్నాడు. ఏం మాట్లాడలేదు. పెద్దగా మాట్లాడలేడు. పెద్దగా ఏమీ తెలియనట్లు అనిపించింది" అని పాల్ చంద్ అనే పోలీసు అధికారి తెలిపారు. మొద‌ట అక్క‌డికి చేరుకుని డోర్ త‌ట్ట‌గా ఎవ‌రూ తీయ‌లేద‌ని తెలిపారు. దీంతో పోలీసులు బలవంతంగా ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. లోపలికి వెళ్లగానే కొడుకు మృతదేహం పక్కనే వృద్ధుడు కూర్చున్నట్లు గుర్తించారు. వృద్ధుడు అర్ధ స్పృహలో ఉన్నాడు. అలాగే, తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. బల్వంత్‌ను వెంటనే ఇంటి నుండి బయటకు తీసుకెళ్లి, ఫేజ్ VIలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కోసం అతన్ని చేర్చారు. అలాగే, ప్రత్యేక బృందం సుఖ్‌విందర్ మృతదేహాన్ని అదే ఆసుపత్రికి తరలించింది. కాగా, "చ‌నిపోయిన యువకుడు అతని దత్తపుత్రుడు. అతనికి సొంత పిల్లలు లేరు. ఎవరైనా వారిని సందర్శించేవారో లేదో నాకు తెలియదు. వృద్ధుడు గత నెల రోజులుగా లోపల ఉన్నాడు. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. దుర్వాసన రావడంతో మాకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు.. దీంతో మేము పోలీసులకు ఫోన్ చేసాము”అని పొరుగువారు చెప్పారు.