ఉత్తరప్రదేశ్‌లో ఓ తన కుతూరిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగుచెందిన ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విసుగుచెందిన ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. జలాన్‌లో నివాసముండే.. మైనర్ బాలికను పథకం ప్రకారం.. మార్చి 28న పుట్టినరోజు వేడుక ఉందని పిలిచి..ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి ఆ బాలిక తప్పించుకోని ఇంటికి చేరింది. జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కానీ.. పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. మరోవైపు.. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ తరుణంలో మే 31న ఉన్నతాధికారులను కలిసి.. మరోసారి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
తమ ఫిర్యాదుపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేసును ముగించాలని బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చారని బాలిక తల్లి ఆరోపించింది. వారు పోలీస్ సూపరింటెండెంట్ ఇరాజ్ రాజాను కూడా సంప్రదించారని, అతను తిరిగి ఐట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని కోరాడని ఆమె చెప్పింది. తిరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా.. ఆమె కుటుంబం శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి 'జన్సున్వాయి' పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత ఎస్పీ దానిని గుర్తించి, SHOపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఈ కేసులో పోలీసులు ఆలస్యం చేయడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఏప్రిల్ 2న (మరుసటి రోజు) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రెండు కేసులను దర్యాప్తు చేయాలని సర్కిల్ అధికారి కొంచ్ శైలేంద్ర కుమార్ బాజ్‌పాయ్‌ను ఎస్పీ ఆదేశించారు. ప్రాథమికంగా బాలిక తల్లి చేసిన ఆరోపణలు నిజమని తేలడంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఇద్దరు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
