ఈ వీడియోలో కనపడుతున్న కాకి అలాంటి.. ఇలాంటి కాకి కాదు. దాని తెలివి ముందు మనుషులు కూడా వెనక్కి తగ్గాల్సిందే. అంత తెలివి ఆ  కాకి ఏం ప్రదర్శించింది అనే కదా మీ డౌట్.

ఇంతకీ మ్యాటరేంటంటే... సాధారణంగా కాకులకు ఆకలయితే ఏం చేస్తాయి. ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని వెతుకుతాయి. కనపడగానే.. మనుషులకు దొరకకుండా తనకు కావాల్సిన ఆహారం తీసుకొని ఎగిరిపోతాయి. తర్వాత ఏ చెట్టమీదో కూర్చొని తీరిగ్గా తింటాయి. ఈ చేప మాత్రం అలాంటిది కాదు. దొరికినది తినే రకం కాదు.. కవాల్సినది సాధించుకొని తినే రకం.

కేరళ రాష్ట్రం కొచ్చి ప్రాంతానికి చెందిన ఈ కాకి... ఓ చేపల మార్కెట్ ముందుకు వెళ్లింది. అక్కడ కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న చేపలు చూసింది. కడుపులో ఆకలి తీరాలంటే అక్కడి నుంచి ఒక చేపను ఎత్తుకెళ్లాలి. అయితే... ఆ కాకి అలా చేయలేదు. ఆ దుకాణం యజమానితో బేరం ఆడింది.దీనంగా ఆ దుకాణం ముందు ఉన్న కాకికి దుకాణం యజమాని జాలితో ఓ చేపను ఇచ్చాడు. అది తీసుకోలేదు. దాని కన్నా ఇంకొంచెం పెద్దది ఇచ్చాడు అయినా తీసుకోలేదు. చివరకు అన్నింటికన్నా పెద్ద చేపను ఇచ్చాక.. సంతోషంగా దానిని తీసుకొని ఆనందంగా ఎగిరిపోయింది. ఈ వీడియో గతేడాది పాపులర్ కాగా... తాజాగా మరోసారి సోషల్ మీడియాని ఏలేస్తోంది.

తాజాగా ఓ సెలబ్రెటీ కంట ఈ వీడియో పడగా.. ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి.