Asianet News TeluguAsianet News Telugu

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. నదిలో పడ్డ కారు.. ఆరుగురి మృతి..

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఆది కైలాసాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా.. అదుపు తప్పి కారు నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆ వాహనంలో 6 మంది ఉన్నారని పోలీసులు చెప్పుతున్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 

6 Killed After Car Falls Into River In Uttarakhand KRJ
Author
First Published Oct 25, 2023, 5:54 AM IST | Last Updated Oct 25, 2023, 5:54 AM IST

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయింది. వాహనంలో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో వీరంతా మృతి చెంది ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.నది ప్రవాహం తీవ్రంగా ఉండటంతో పోలీసులు,SDRF సైనికులు రక్షించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో నెట్‌వర్క్ సమస్య ఉంది. దీని కారణంగా రెస్క్యూ టీమ్‌లు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు.

గుంజి నుంచి ధార్చుల వెళ్తుండగా టంపా దేవాలయం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం కొంతమంది పర్యాటకులు కైలాష్‌ను సందర్శించి తిరిగి వస్తున్నారు. గుంజి నుంచి ధార్చుల వెళ్తుండగా టంపా దేవాలయం సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి నదిలో పడిపోయింది. అటుగా వెళ్తున్న మరో వాహనం డ్రైవర్ ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పాంగ్లా పోలీస్ స్టేషన్, ధార్చుల పోలీస్ స్టేషన్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో పడ్డ వారిని రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ చాలా లోతు ఉండటం,ప్రమాదం జరిగిన ప్రదేశంలో మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో  ఫలితం లేకుండా పోయింది.  

దసరా రోజున పితోర్‌ఘర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారులోని వ్యక్తులు ఆది కైలాస దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది. కారులో ఉన్న ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు బెంగళూరు, ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఉత్తరాఖండ్‌కు చెందిన వారని తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రార్థించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios