ప్రధానికి నేరుగా బర్త్ డే విషెస్ చెప్పే ఛాన్స్.. నమో యాప్ లో ‘ఎక్స్ ప్రెస్ యువర్ సేవా భావ్’ ప్రారంభం
నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. దేశంలోని ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు, బహుమతిని పంపించేందుకు బీజేపీ అవకాశం కల్పించింది. నమో యాప్ ఉపయోగించి ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేయడం ద్వారా విషెష్ తెలియజేయవచ్చు. అలాగే అందులో ఉన్న సేవా కార్యక్రమాలను పూర్తి చేయడం ద్వారా ప్రధానికి బహుమతిని పంపవచ్చు.

నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. అనేక సేవ కార్యక్రమాలు కొనసాగున్నాయి. కాగా..ప్రధాని మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నేటి (ఆదివారం) నుంచి 'సేవా పఖ్వాడా' అనే కార్యక్రమం ప్రారంభించనుంది. దీంతో పాటు నమో యాప్ లో ‘ఎక్స్‌ప్రెస్ యువర్ సేవా భావ్’ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఇందులో పాల్గొనడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతీ ఒక్కరూ నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంటుంది. దేశానికి సేవ చేసేలా పౌరులను ప్రేరేపించడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమని బీజేపీ పేర్కొంది.
ఈ నమో యాప్ ద్వారా ప్రజలు వీడియో సందేశం పంపించి కూడా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. దీని కోసం శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను రికార్డ్ చేసి, దానిని నయో యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో గ్రీటింగ్స్ వీడియో వాల్ పై కూడా కనిపిస్తాయి. దీనిని రీల్ ఫార్మట్ లో తయారు చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా వీడియోను అప్ లోడ్ చేయొచ్చు.. - https://nm-4.com/VideoShubhkaamna
ఈ వీడియో సందేశంతో పాటు ప్రధానికి ‘సేవ బహుమతి’ కూడా ఇవ్వొచ్చని బీజేపీ పేర్కొంది. పలు సేవా కార్యక్రమాలు చేసి, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేయడం ద్వారా ప్రధానికి బహుమతి ఇవ్వవచ్చని తెలిపింది. నమో యాప్ ఉపయోగించే వారు, లేదా ఎవరైనా కింద సూచించిన సేవా కార్యక్రమం చేసి ప్రధానికి బహుమతి పంపవచ్చని పేర్కొంది. ఇందులో 9 విభిన్న సేవా కార్యక్రమాలు ఉన్నాయి. దానిని పూర్తి చేసిన అనంతరం యూజర్ ఫోటోలను అప్ లోడ్ చేయవచ్చు. సేవా కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పొందిన బ్యాడ్జీలను వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. వారిని కూడా ఇందులో పాల్గొనాలని ప్రోత్సహించవచ్చు.
1. ఆత్మనిర్భర్ - ఇండియాను ఆత్మనిర్భర్ గా మార్చే యాక్టివిటీ చేస్తున్న ఫొటోను యూజర్లు షేర్ చేయవచ్చు.
2. రక్తదానం - రక్తదానం చేసి, దానికి సంబంధించిన ఫోటోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలను రక్షించవచ్చు. ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలవవచ్చు.
3. వర్షాన్ని పట్టుకోండి - 'క్యాచ్ ది రెయిన్' క్యాంపెయిన్ గురించి అవగాహన పెంచడానికి సహాయపడే వర్షపు నీటిని సంరక్షించడానికి స్థానిక లేదా వినూత్న పరిష్కారాల వీడియోను షేర్ చేయవచ్చు.
4. డిజిటల్ ఇండియా - ప్రజలు తమ దైనందిన జీవితంలో డిజిటల్, టెక్ ఆవిష్కరణను అవలంబించడం లేదా మరో వ్యక్తికి టెక్నాలజీ గురించి నేర్పించడంలో సహాయపడే వీడియోను పోస్టు చేయవచ్చు.
5. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ - భారతదేశం శక్తివంతమైన వైవిధ్యం, అందమైన సంస్కృతిని ప్రదర్శించే ప్రత్యేక కార్యక్రమాల వీడియోలు షేర్ చేయొచ్చు.
6. ఎల్ఐఎఫ్ఈ : పర్యావరణానికి జీవనశైలి అనే ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మంత్రం వైపు తమ కదలికను చూపించే ఫొటోలను యూజర్లు అప్ లోడ్ చేయవచ్చు.
7. స్వచ్ఛ భారత్ - ప్రజలు తమ పరిసరాలను శుభ్రం చేయడానికి చొరవ తీసుకున్న వీడియోలు అందులో అప్ లోడ్ చేయవచ్చు.
8. టీబీ ముక్త్ భారత్ - టీబీని దేశం నుంచి తరిమివేయడానికి ప్రయత్నించడం. అందులో భాగంగా టీబీ రోగిని దత్తత తీసుకుని పౌష్టికాహారం, మందులు, అవగాహన వంటి అత్యవసర సేవలను అందించడానికి భరోసా ఇచ్చే మాధ్యమాన్ని అవలంబిస్తామని ప్రతిజ్ఞ చేయడం.
9. వోకల్ ఫర్ లోకల్ - స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువును కొనుగోలు చేయడం. సంతోషంగా ఉన్న విక్రేత ఫొటోలను, కొనుగోలు చేసిన ఫొటోలను ఇందులో అప్ లోడ్ చేయవచ్చు.
ఈ కార్యక్రమంతో పాటు కుటుంబం అంతా ప్రధానికి ఒకే సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని నమో యాప్ కల్పించింది. 'ఫ్యామిలీ ఈ కార్డ్' అనే ఆప్షన్ ద్వారా దానికి సంబంధించిన వీడియోను ఒకే గ్రీటింగ్ లో చేర్చే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రధానికి ఒక కుటుంబంగా శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉంది.
ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఫ్యామిలీ ఈ కార్డ్ గ్రీటింగ్స్ చెప్పొచ్చు - https://nm-4.com/FamilyEcard