13 మందితో ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో అది అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరి కొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగింది.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పై ఓ కారు టైరు పగిలిపోయింది. దీంతో అది అదుపు తప్పి బారియర్‌ను ఢీకొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. కారు ప్రమాదానికి టైరు పేలడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. ఔరంగాబాద్ నుంచి 13 మంది ప్రయాణికులతో ఓ కారు షెగావ్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై బుల్దానాలోని శివని పిసా గ్రామ సమీపంలోకి చేరుకుంది. అయితే ఒక్క సారిగా కారు టైరు పేలింది. దీంతో డ్రైవర్ కారును అదుపు చేయలేకపోవడంతో వాహనం రోడ్డుపై వేసిన బారియర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఇందులో ఓ వ్యక్తి, నలుగురు మహిళలు, ఒక యువతి ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని ఔరంగాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ, ఏపీ వాసులకు చల్లని కబురు.. ఈ నెల 15 నుంచి వర్షాలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై అనేక ప్రమాదాలు జరిగాయి. ముంబై - నాగ్‌పూర్ మధ్య ఉన్న ఈ రహదారి పొడవు 701 కిలోమీటర్లు. ఇది గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఇందులో 17 అండర్‌పాస్‌లు ఉన్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నాగ్‌పూర్, వార్ధా, అమరావతి, వాషిం, అహ్మద్‌నగర్, నాసిక్, బుల్దానా, ఔరంగాబాద్, జాల్నా, థానే అనే 10 జిల్లాల గుండా వెళుతుంది.
కర్ణాటకలో ప్రధాని టూర్: మాండ్యలో మోడీకి బ్రహ్మరథం
మహారాష్ట్రలోని లాతూర్‌లో ఇలాంటి ప్రమాదమే ఈ నెల 5వ తేదీన చోటు చేసుకుంది. ఓ మోటర్‌బైక్‌ను టెంపో ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ బైక్ పై ఆరుగురు వ్యక్తులు కూర్చొని రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు. ఈ బైక్ కలాంబ్ వైపు వెళ్తోంది. ఇదే సమయంలో ఎదురుగా ఓ టెంప్ వేగంగా వస్తోంది. అయితే ఎదురుగా, రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ను టెంపో గమనించకపోవడంతో దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం విచారకరం. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే గేట్‌గావ్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాలను లాతూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ లో చేర్పించారు.
