Asianet News TeluguAsianet News Telugu

రాజ‌స్థాన్ బీజేపీ ఎంపీ స‌న్నిహితుడి దారుణ హ‌త్య‌.. తుపాకీతో ఏడు రౌండ్లు ఛాతీలో కాల్చిన దుండ‌గులు..

రాజ‌స్థాన్ బీజేపీ ఎంపీ స‌న్నిహితుడి ఎంపీ రంజీతా కోలీ సన్నిహితుడు, డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ ను పలువురు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

A brutal murder of a close friend of Rajasthan BJP MP.. The assailant shot seven rounds in the chest with a gun..
Author
First Published Sep 5, 2022, 2:38 PM IST

రాజస్థాన్‌లో గ్యాంగ్ వార్ చేతిలో బీజేపీ ఎంపీ స‌న్నిహితుడు హతం అయ్యాడు. అత‌డి ఛాతీలో 7 రౌండ్ల బులెట్లు ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది భరత్‌పూర్ జిల్లా జగినా గ్రామానికి చెందిన రైల్వే అడ్వైజరీ కమిటీ సభ్యుడు కృపాల్ సింగ్‌ను మధుర గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఘిన గేట్ వద్ద దుండ‌గులు అర్థరాత్రి కాల్చి చంపారు. మృతుడు బీజేపీ ఎంపీ రంజీతా కోలీకి సన్నిహితుడు.

సైరస్ మిస్త్రీ పోస్ట్‌మార్టం నివేదిక విడుదల... మరణానికి కార‌ణ‌మేమిటంటే..?

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎంపీ రంజితా కోలికి ద‌గ్గ‌రి వ్య‌క్తి అయిన కృపాల్ సింగ్ జ‌గినా గ్రామంలో నివ‌సించేవారు. ఆదివారం రాత్రి సింగ్ ఏదో పని నిమిత్తం సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. 10 గంటల ప్రాంతంలో సర్క్యూట్ హౌస్ నుంచి తన కారులో ఇంటికి బయలుదేరాడు. జగినా రైలు  గేటు వద్దకు రాగానే 3 బైక్‌లు, 2 వాహనాల్లో వచ్చిన దుండగులు ఆయనను చుట్టుముట్టి కారుపై కాల్పులు జరిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయారు.ఈ ఘటనలో బుల్లెట్ల వ‌ల్ల తీవ్రంగా గాయపడిన కృపాల్‌ను స్థానికులు ఆర్‌బీఎం ఆస్పత్రికి తరలించారు. 

జార్ఖండ్‌‌లో విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

అక్క‌డి నుంచి డాక్ట‌ర్లు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అత‌డు మృతి చెందాడ‌ని డాక్ట‌ర్లు ప్ర‌క‌టించారు. పోలీసులు మృతదేహాన్ని ఆర్‌బీఎం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఉదయం అక్క‌డే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 

ఈ ఘ‌ట‌న‌పై ఏఎస్పీ అనిల్ మీనా మాట్లాడుతూ.. కృపాల్ సింగ్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారని తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామ‌ని, మ‌రింత స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని మధుర గేట్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామ్‌నాథ్ సింగ్ తెలిపారు. కాగా.. ముఠా కక్షల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

లింగాయత్ మఠాధిపతికి జ్యుడీషియల్ కస్టడీ.. ఆ రోజే బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ‌

మృతదేహాన్ని ప‌రిశీలించ‌డానికి రంజీతా కోలీ హాస్పిటల్ ను సంద‌ర్శించారు. ‘‘ DRUCC (డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ) సభ్యుడు, కిసాన్ మోర్చా మాజీ ప్రతినిధి కృపాల్ సింగ్ జాగినా జీ మరణం కారణంగా ఈ రోజు నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాను ’’ అని కోలీ హిందీలో ట్వీట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios